బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పట్టిన మల్లవరం,జెట్టిపాలెం గ్రామస్తులు..

మల్లవరం లో 11 కుటుంబాల వారు వైసిపి పార్టీని వీడి బ్రహ్మారెడ్డి సమక్షంలో టిడిపి లోకి చేరారు.

బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పట్టిన మల్లవరం,జెట్టిపాలెం గ్రామస్తులు..

ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల ఏప్రిల్ 28: రెంటచింతల మండలంలోని మల్లవరం,జెట్టిపాలెం గ్రామాలలో  ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు  ప్రజలు పెద్ద సంఖ్యలో బ్రహ్మరథం పట్టారు.గజమాలతో బాణాసంచా కాల్చుకుంటు, మేళతాళాల నడుమ గ్రామంలోకి ప్రజలు బ్రహ్మారెడ్డి కి స్వాగతం  పలికారు.మల్లవరం గ్రామంలో సుమారు 11 కుటుంబాల వారు వైసిపి పార్టీని వీడి కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, వైసీపీచేస్తున్న దుర్మార్గ పాలనను ప్రజలు గమనించాలన్నారు.కూతవేటులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్న కనీసం గుక్కెడు నీరు కూడా నియోజకవర్గ ప్రజలకు ఇవ్వలేని స్దితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన,టీడీపీ కూటమి అభ్యర్థులు ఘన విజయాలు పొందుతారన్నారు. ఈ కొద్ది రోజులు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే మన అందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించుకుందాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను అందించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలోమేకల బాల సైదయ్య, దొడ్డ ఎర్రయ్య,షేక్ చిన్న మౌలాలి,కొండా నాయక్,శంకర్ నాయక్, బాలు నాయక్,మేకపోతుల కృష్ణ,మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి,వైస్ ఎంపిపి గొంటు సుమంత్ రెడ్డి,మాజీ పిహెచ్సి చైర్మన్ రామకృష్ణ,గొట్టం శీను, ప్రభురాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 44

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి