బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా

గాజువాక వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ హామీ

బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా

ఐ ఎన్ బి టైమ్స్ గాజువాక ప్రతినిధి, మే 01: గాజువాక నియోజకవర్గంలోని బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు. గాజువాక పారిశ్రామిక ప్రాంత టీచర్స్ అసోసియేషన్ (జిప్సర్) అధ్యక్షులు పి.భాస్కరరావు ఆధ్వర్యంలో అమర్నాథ్ కు మద్దతు తెలుపుతూ బుధవారం గాజువాకలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. గతంలో ఎన్నడు లేరు విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహించారని ఆయన చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గత కొంతకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని భాస్కరరావు అమర్నాథ్కు విజ్ఞప్తి చేశారు. అలాగే అసోసియేషన్ చెందిన మరి కొంతమంది నాయకులు ప్రభుత్వపరంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు మేలు జరిగేలా చూడాలని కోరారు.మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసిందని చెప్పారు. పేద పిల్లలకు మెరుగైన విద్య అందిస్తున్నారని, స్వతంత్ర భారతదేశంలో ఎన్నడు లేనివిధంగా నాడు నేడు పథకం కింద పాఠశాలను12000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అమ్మ ఒడి అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి మాత్రమే దక్కిందని అన్నారు. బడ్జెట్ స్కూల్ కు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వస్తుంది.అప్పుడు ఈ ప్రైవేటు స్కూల్స్ ను క్లస్టర్ గా విభజించడంద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అమర్నాథ్ తెలియజేశారు. అలాగే అసోసియేషన్ భవన నిర్మాణానికి సహకరిస్తానని అమర్నాథ్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య, గాజువాక నియోజకవర్గ అబ్జర్వర్ తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 3

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి