మేడే స్ఫూర్తితో ఫాసిస్టు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం

సిపిఎం జిల్లా కార్యాలయంలో మేడే జండా ఆవిష్కరణసభలో - సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

మేడే స్ఫూర్తితో ఫాసిస్టు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01:   ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో బుధవారం మేడే దినోత్సవం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రం అధ్యక్షతన జరిగిన సభలో నున్నా మాట్లాడుతూ, చికాగో కార్మికుల చారిత్రాత్మక వీరోచిత పోరాటానికి మే ఒకటితో 138  ఏళ్ళు పూర్తి అవుతుందన్నారు. 8 గంటల పని, ఇతర హక్కులు, సౌకర్యాల కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్న కార్మికులపై అమెరికన్‌ ప్రభుత్వం కాల్పులు జరిపి కార్మికుల ప్రాణాలను బలి తీసుకోవడం జరిగిందన్నారు. నాటి నుండి మే1 ని కార్మిక దినోత్సవంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్నామని అన్నారు. ఆ కార్మికుల రక్తంతో ఎరుపెక్కిన ఎర్ర జెండా నీడలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను నేటి ప్రభుత్వాలు హరించి వేస్తున్నాయన్నారు. మన దేశంలో కార్మికుల హక్కులను కాలరాచే నాలుగు లేబర్‌ కోడ్‌లను పార్లమెంట్‌లో ఆమోదించుకున్నప్పటికీ, ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందనే         ఉద్ధేశ్యంతో అమలుపర్చడం లేదన్నారు. మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే ఈ లేబర్‌ కోడ్‌లను అమలు చేస్తుందని తద్వారా కార్మికవర్గం తీవ్రంగా నష్టపోతుందని, దీనికి వ్యతిరేకంగా తీవ్ర ప్రతిఘటనా పోరాటాలు చేయాల్సి ఉంటుందన్నారు. కేవలం కార్మికులే కాకుండా ఈరోజు సమాజంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, అణగారినవర్గాలు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని స్వతంత్ర సంస్థలు, వ్యవస్థలను నీరుగారుస్తోందని, అన్నింటిని కాషాయీకరణ చేస్తుందని, కార్పొరేట్లకు పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. ఎన్నికల సభలలో ప్రధాని తన హోదాను మర్చిపోయి ఒక సాధారణ బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలాగా ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా హిందూ ఓటర్లను రెచ్చగొడుతూ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలను లాక్కుంటుందని, సంపదను ముస్లింలకు పంచిపెడుతుందని, కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఒక అర్బన్‌ నక్సల్‌ మేనిఫెస్టో అంటూ దిగజారుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఈ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడి తమ ప్రాణాలు సైతం అర్పించి సాధించుకున్న స్వాతంత్య్రం నేడు ప్రమాదంలో పడిరదన్నారు. దేశంలో ప్రస్తుతం అప్రకటిత నియంతృత్వం అమలు జరుగుతుందని అన్నారు. స్వాతంత్య్రానంతరం ఈ దేశాన్ని గాడిన పెట్టడానికి, ఒక సుపరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి తగ్గట్లుగా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ ఇచ్చారని, అటు వంటి రాజ్యాంగాన్ని తాము అధికారంలోకి రాగానే మార్చివేస్తామని అంటున్నారని, పురాతన మనుస్మృతిని రాజ్యాంగంగా చేసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇదే జరిగితే నష్టపోయేది అణగారిన ప్రజలేనని అన్నారు. ఈ ఫాసిస్టు బిజెపి పాలనను అంతమొందించకుంటే దేశం తీవ్రమైన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని, వ్యక్తిగత స్వేచ్ఛ, మాట్లాడే, ప్రశ్నించే హక్కే లేకుండా పోతుందని అన్నారు. అందుకే ఈ దేశ రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని రక్షించుకోవటానికి దేశవ్యాప్తంగా బిజెపిని ఓడిరచటానికి ‘‘ఇండియా’’ కూటమి ఏర్పడిరదని అన్నారు. ఈ మేడే సందర్భంగా అందరం ఫాసిస్టు బిజెపి పాలనను అంతమొందించేందుకు కంకణం కట్టుకోవాలని, ఇండియా కూటమిని గెలిపించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో యర్రా శ్రీకాంత్‌, మాచర్ల భారతి, ఎం.సుబ్బారావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్‌, యర్రా శ్రీనివాసరావు, బండారు రమేష్‌, ఎస్‌.నవీన్‌రెడ్డి, దొంగల తిరుపతిరావు, తుమ్మ విష్ణు, వాసిరెడ్డి వరప్రసాద్‌, రaాన్సీ, పిన్నింటి రమ్య, కె. దేవేంద్ర, బోడపట్ల సుదర్శన్‌, జిల్లా ఉపేందర్‌, వై.శ్రీనివాసరావు, నెల్లూరి వీరబాబు, ఎస్‌.కె.అఫ్జల్‌, శివన్నారాయణ, కళ్యాణం నాగేశ్వరరావు, నన్నక గోవిందరావు, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, గణపతి, మాచర్ల గోపాల్‌, పుల్లయ్య, జక్కంపుడి కృష్ణ, తుడుం ప్రవీణ్‌, గాలి వెంకటాద్రి, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 13

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి