కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..

కార్మికోద్యమాలకు పాలకులు తలవంచక తప్పదు. మేడే పోరాట స్పూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకుంటాం : సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం.

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..

ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మే 01: కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం పిలుపునిచ్చారు. 138వ మే డే సందర్భంగా పాల్వంచ పట్టణ, మండల పరిధిలోని 20 సెంటర్లలో, ఏఐటియుసి అనుబంధ ప్రజాసంఘాలు కార్యాలయాల వద్ద అరుణ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో నగరాన ఉవ్వెత్తున సాగైన పోరాటంలో ఎందరో కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసారని అన్నారు. ఆనాటి పోరాటమే ఎనిమిది గంటల పని విధానంని, కార్మిక చట్టాలని, చికాగో అమరుల స్పూర్తితో నేటి పాలకుల పై పోరాటాలకు కార్మికలోకం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. కార్మిక వర్గానికి అనేక హామీలు గుప్పించిన అధికారంలోకి వచ్చినా కేంద్రంలోని బిజెపి సర్కార్ అధికారం చేపట్టిన తరవాత అనేక పోరాటాలుతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు, కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను కార్మిక వర్గం ఉద్యమాలతోనే తిప్పికొట్టి సంక్షేమ చట్టాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టం, పారిశ్రామిక చట్టాలను సవరణ చేయడంతోపాటు సంస్కరణలు పేరుతో ఉద్యోగులను, కార్మికులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని, ప్రభుత్వాల దుశ్చర్యలను కార్మికువర్గ పోరాటంతో ఎదిరించి హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్,  ఏఐటియుసి పట్టణ అధ్యక్షుడు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వర్లు, నరహరి నాగేశ్వరరావు, శనగరపు శ్రీనివాస్, ఇట్టి వెంకట్రావు, కోరే కృష్ణ, రాకేష్, మన్నెం వెంకన్న, ఎండి పాషా, గుండాల సృజన్, నారుపోగు రామయ్య, రమేష్, వెంకన్న, ఆదినారాయణ, సూరజ్,  సత్యనారాయణ, మంజునాథ్, ఈసం రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 19

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి