పార్లమెంట్ ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీ ని ఓడించండి

సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

పార్లమెంట్ ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీ ని ఓడించండి

ఐ ఎన్ బి టైమ్స్ నల్గొండ ప్రతినిధి మే 02: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నల్లగొండ పట్టణ జనరల్ బాడీ సమావేశం బొమ్మిడి నగేష్ శ్రామిక భవన్ (న్యూడెమోక్రసీ కార్యాలయంలో) లో అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వన్ని ఓడించాలని అని అన్నారు.బిజెపి గత పది సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాదించిన డబ్బును జిఎస్టి పేరుతో పన్నుల రూపం లో వచ్చిన సంపదను కొద్ది మంది పెట్టుబడుదారులకు కట్టబెడుతూ , బడా పెట్టుబడిదారులకు వేలకోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారని, ప్రభుత్వ సెక్టార్ కి సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని  , ప్రైవేటీకరణ లో రిజర్వేషన్లు రద్దు అవుతాయని కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాల్లేకుండా పోతాయని అన్నారు, పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బిజెపి ప్రభుత్వం ఉందని , మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతు పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, స్వాతంత్ర సమరయోధులకు మరియు ఇతర వ్యక్తులకు మతం రంగు పుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగము, అధిక ధరలు పెరిగిపోయాయని ,రైతు,కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి సంక్షోభంలో కి నెట్టివేశారని కావున పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వన్ని ఓడించాలని   పిలుపునిచ్చారు.ఈ సదస్సులో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసి నాయకులు బొమ్మిడి నగేష్,బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బి.వి చారి, పోలె పవన్,రావుల వీరేశ్,జానపాటి శంకర్,దాసరి నర్సింహా, బొమ్మపాల అశోక్,అక్కినపల్లి అంజి,నాంపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 65

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి