సిపిఐలో చేరిన కొత్తగూడెం మున్సిపల్ 25వ వార్డు కౌన్సిలర్..నారాయణ, కూనంనేని సమక్షంలో కొత్తగూడెం, పాల్వంచ నుంచి 50 కుటుంబాలు సిపిఐలో చేరిక.

కమ్యూనిస్టు పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు : డాక్టర్ కే నారాయణ.

సిపిఐలో చేరిన కొత్తగూడెం మున్సిపల్ 25వ వార్డు కౌన్సిలర్..నారాయణ, కూనంనేని సమక్షంలో కొత్తగూడెం, పాల్వంచ నుంచి 50 కుటుంబాలు సిపిఐలో చేరిక.

ఐ ఎన్ బి టైమ్స్ కొత్తగూడెం,పాల్వంచ మే 02: కొత్తగూడెం మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ సాహెరాబేగం దంపతులతోపాటు కొత్తగూడెం పట్టణానికి పట్టణానికి చెందిన నేరెళ్ల రమేష్, మాదాసు మాధవ్, పద్మప్రియ, పైడిపల్లి లక్ష్మి, పాల్వంచకు చెందిన ఎస్ కె గౌస్, ఎస్ ఏ రహమాన్, మహమ్మద్ అహ్మద్ జానీ, ఎస్ కె కరీం, మహమ్మద్ యాకూబ్, ఇట్టి వెంకట్ రావు, కరీం, కాజా, బర్ల వెంకటరత్నం, ఖలీం, కళ్యాణ్, యాకూబ్,రమేష్,నరేష్ తదితరులు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సమక్షంలో గురువారం సీపీఐలో చేరారు. ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్స్లో జరిగిన ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మండలాలు, పట్టణాల సిపిఐ సమితి సభ్యుల సమావేశం సందర్బంగా వారి సిపిఐలో చేరారు. వీరికి నారాయణ, కూనంనేని పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన స్థానిక ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాల భాద్యతలు స్వీకరించి ప్రజా సమస్యల పరిస్కారంకోసం పనిచేయాలని, తద్వారా పార్టీని కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తరించాలని సూచించారు. కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు, రాష్ట్రంలో సిపిఐకి జనాదరణ పెరుగుతోందని ప్రజలకోసం పనిచేసే పార్టీలను ప్రజలు ఎన్నటికీ ఆదరిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, భద్రాద్రి, ఖమ్మం జిల్లా కార్యదర్శులు ఎస్ కె సాబీర్ పాషా, పోటు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, చంద్రగిరి శ్రీనివాసరావు, దుర్గరాసి వెంకన్న, సలిగంటి శ్రీనివాస్, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమాల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 10

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి