మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి

రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు

మోదీది అరాచక పాలన  * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు   *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి

 ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోదీ అరాచక పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి విమర్శించారు. బుధవారం నగరంలోని శ్రీశ్రీ హోటల్ లో జరిగిన ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి హాజరై ప్రసంగించారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. హిందువుల తాళిబొట్లు తీసి ముస్లింలకు ఇస్తారని దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని తెలిపారు. 
రాజ్యాంగం మారుస్తారంట..
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే.. పరిపాలన దిక్సూచిగా నిలిచే భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తోందని, సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకురాబోతోందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందామని, ఇక్కడ మన రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై ఓటేసేలా విస్తృత ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. 
కాంగ్రెస్ నేత దొడ్డ నగేష్ అధ్యక్షతన.. జరిగిన ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, టీపీసీసీ నేత మద్ది శ్రీనివాసరెడ్డి, వడ్డే బోయిన నరసింహారావు, ఏ ఎస్ ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఆవుల సైదేశ్వర రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, నాయకులు ఎండీ.ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి