ఈసారి మోదీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు..* రాజ్యాంగాన్ని ఎత్తివేసి నియంత పాలన చేస్తాడు * సబ్బండ వర్గాలు అవస్థ పడతాయి * కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అంతా కృషి చేద్దాం

* మిర్చి యార్డులో కార్మిక, వ్యాపార సమ్మేళనంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని * ఓటు అనే బ్రహ్మాస్త్రంతో.. రాహుల్ ను ప్రధాని చేద్దాం: రేణుకా చౌదరి * బీఆర్ఎస్ చేసిందేమీ లేదు: రఘురాం రెడ్డి

ఈసారి మోదీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు..* రాజ్యాంగాన్ని ఎత్తివేసి నియంత పాలన చేస్తాడు  * సబ్బండ వర్గాలు అవస్థ పడతాయి * కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అంతా కృషి చేద్దాం

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: ఈ లోకసభ ఎన్నికల్లో పొరపాటున మోదీ గనక మళ్ళీ  అధికారంలోకి వస్తే.. దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని, రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఆయన నియంతలా వ్యవహరిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ.. గురువారం మిర్చి మార్కెట్ సమీపంలోని ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్మిక, వ్యాపారుల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. 
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించడమే పరిరక్షణ మార్గం అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి దిక్సూచి లా ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి, మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొస్తారని విమర్శించారు. అందరికీ ఇళ్లు, అర్హులకు ఉద్యోగాలు, రైతులకు మూడింతల మద్దతు ధర అంటూ మోడీ అధికారంలోకి వచ్చి ఇవేమీ ఆచరణలో పెట్టలేదని తెలిపారు. ఢిల్లీలో సుదీర్ఘకాలం నిరసన తెలిపినా రైతులపై కనికరం కలగలేదని, వందలాది మంది చనిపోయారని అన్నారు. బీసీ కులగణన చేపట్టి, అన్ని వర్గాల వారికి పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.  కాంగ్రెస్ కు వామ పక్షాలు పూర్తిస్థాయిలో  మద్దతు తెలుపుతున్నాయని, రాష్ట్రంలోనే ఖమ్మం ఎంపీ స్థానం అత్యధిక మెజారిటీ సాధిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రధాని..: రేణుకా చౌదరి దేశ ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, అరాచక పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోవద్దని అన్నారు. ముస్లింలకు హిందువుల తాళిబొట్లు తీసి ఇస్తారని ప్రచారం చేస్తున్నారని, బ్రహ్మాస్త్రం అయిన మన ఓటు ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చి వేద్దామని పిలుపునిచ్చారు. పిల్లలు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కట్లేదని, కనీసం సంతాన బాధ్యతలు చూడని మోదీకి మన కష్టాలు ఎలా అర్థమవుతుందని విమర్శించారు. బ్రహ్మాస్త్రం అయిన మన ఓటు ద్వారా బీజేపీ  ప్రభుత్వాన్ని కూల్చివేద్దామని అన్నారు. రూ.7లక్షల కోట్ల అప్పుల భారం వేసి కేసీఆర్ పోయిండు..: రఘురాం రెడ్డిబీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై పెనుభారం వేసి పోయాడని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.  పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేదని అన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని, ప్రజాసేవ చేసుకుంటానని తెలిపారు. అతనొక మహమ్మారి..:తీన్మార్ మల్లన్న నల్లధనం తీసుకొస్తా అని తేలేదని, రెండు కోట్ల ఉద్యోగాలని ఉన్నవి పీకాడని తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మహమ్మారిలా తయారయ్యాడని, వామపక్షాలతో కలిసి నిలువరిద్దామని అన్నారు. కేసీఆర్,  కేటీఆర్ అక్రమ కేసులతో జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ భూ స్థాపితమైoది..: పొంగులేటి ప్రసాద్ రెడ్డి బీఆర్ఎస్ పనైపోయిందని, దానికి ఓటు వేస్తే మురిగిపోయినట్లేనని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకంటే మించి ఎన్నికల్లో రావాలని, రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సభాధ్యక్షులు వెలిశాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. తుమ్మల యుగేందర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంత రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, టీపీసీసీ నేత మద్ది శ్రీనివాసరెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్పొరేటర్  ఉపేందర్, మాజీ కౌన్సిలర్ బాలగంగాధర్ తిలక్, జానీ మియా, ఎండీ. ముస్తఫా, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 7

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన