నా ఖమ్మం జిల్లాలో ప్రజాసేవే లక్ష్యం..

* కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి * గొల్లగూడెం ఈద్గా గ్రౌండ్ లో వాకర్లతో ఆత్మీయ ముచ్చట * కూరగాయల మార్కెట్ లో ప్రచారం

నా ఖమ్మం జిల్లాలో ప్రజాసేవే లక్ష్యం..

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 28: నా సొంత ఊరు అయిన ఖమ్మం జిల్లాలో ప్రజా సేవ చేయడమే లక్ష్యమని, అందుకే ఎంపీ గా పోటీ చేశానని కాంగ్రెస్  లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ప్రచారం చేపట్టారు. తొలుత 14వ డివిజన్ లోని గొల్లగూడెం ఈద్గా మైదానంలో వాకర్లతో కలిసి నడిచారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ముచ్చటించారు. స్థానికంగా కమతం రామకృష్ణ నివాసానికి వెళ్లి..తేనీరు స్వీకరించారు. వ్యాపారం ఎలా సాగుతోంది.. అంటూ రాపర్తి నగర్ లోని కూరగాయల మార్కెట్ సందర్శనలో వ్యాపారులను అడిగారు. దుకాణం.. దుకాణానికి తిరిగి హస్తం గుర్తుపై ఓటేసి .. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రాంగణంలో మాజీ కార్పొరేటర్ తోట రామారావు షాప్ నకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వ్యాపారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామం కూసుమంచి మండలం చేగొమ్మ అని, ఖమ్మంలో గృహం ఉందని అన్నారు. ఎంపీ గా జిల్లా ప్రజలకు నేరుగా ప్రజా సేవ చేసుకుంటానని తెలిపారు. అంతకుముందు పూలు జల్లుతూ.. కోలాటం నృత్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమాల్లో.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, మాజీ కార్పొరేటర్ దీపక్ చౌదరి, రైట్ ఛాయిస్ అధినేత మెండెం కిరణ్, నాయకులు మియా భాయ్, కమతం రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, మల్లేపల్లి సర్పంచ్ బండి వెంకన్న, బొమ్మిడి శ్రీనివాస్, సాయికిరణ్, తోట ప్రసాద్, షరీఫ్, యోగా గురువు బోస్, వడ్డేబోయిన శ్రీనివాసరావు, తాళ్లూరి రాము తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 14

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి