ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్

ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 09: ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరిగేలా, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల బృందాలు  తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గురువారం  నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ బృందాల అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, పరిశీలించాల్సిన విషయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు లోబడి నిర్వర్తించాల్సిన విధులు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో చేయాల్సిన ఏర్పాట్లపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు మాట్లాడుతూ, గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలలో ఏలాంటి సమస్యలు లేకుండా  డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ టీం లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులకు అందించాల్సిన పోలింగ్ మెటీరియల్ బ్యాగ్ ను చెక్ లిస్ట్ తో సహా ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల సిబ్బందికి కౌంటర్లు ఏ విధంగా ఉండాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించారు. ఆయా అధికారులు ఇచ్చిన సూచనలు విధిగా పాటించాలని స్పష్టం చేశారు. రిసెప్షన్ కౌంటర్ ఇన్చార్జి మెటీరియల్ , డాక్యుమెంట్స్ కు సంబంధించిన  అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో సెక్టార్ వారిగా ఈవీఎం, పోల్ మెటీరియల్ పంపిణీ చేయాలని, రిసెప్షన్ సెంటర్లలో కౌంటర్ వారీగా తీసుకోవాలని తెలిపారు. పోలింగ్  టీంలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో 
శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, సహాయ జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు మదన్ గోపాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన