బిజెపి గెలిస్తే.. రాజ్యాంగం రద్దు..- మతతత్వ బిజెపిని ఓడించాలి - ఇండియా కూటమిని గెలిపించాలి

- సిపిఐ (యం.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా

బిజెపి గెలిస్తే.. రాజ్యాంగం రద్దు..- మతతత్వ బిజెపిని ఓడించాలి - ఇండియా కూటమిని గెలిపించాలి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని సిపిఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నూనవత్ వీరునాయక్ తో కలిసి రమేష్ రాజా మాట్లాడారు. బిజెపి 400 సీట్లు గెలిపించాలని అడుగుతుందని, 2/3 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారని చెప్పారు. ఓటమి భయంతో మోదీ అసహనంతో మాట్లాడుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఆయనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్యామ్యాన్ని గౌరవించని పార్టీ బిజెపి అని అన్నారు. దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు మోదీ, బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్ర జేస్తోందని విమర్శించారు. మనుస్మృతిని అమలుచేయాలని చూస్తోందని, ప్రజల మధ్య చీలిక తీసుకోచ్చి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. 10 ఏండ్లకాలంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేసిందని, దేశ సంపదను, సహజ వనరులను అదానీ అంబానీలకు దోచి పెట్టిందని తెలిపారు. అవినీతి, నిరుద్యోగం, ధరలు పెరిగిపోయాయని, సామాన్య ప్రజానీకం బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అణగారిన ప్రజలపై దాడులు పెరిగాయని, మహిళకు రక్షణ లేదని, సామాజిక న్యాయం ఎండమావిగా మారిందని చెప్పారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఆర్థిక సూచిలో 111 స్థానంలో భారత్ ఉందని, మోదీ పాలనలో 30 కోట్ల మంది నిరుపేదలు పెరిగారని, పేదరికం నుంచి విముక్తి కాలేదని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు, అదనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని, వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని, కోత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ప్రశ్నించే గొంతుక లను అణచివేశారని, ప్రతిపక్ష నాయకులపై ఎన్నికల సమయంలో కేసులు పెట్టి జైలులో పెట్టారని దుయ్యబుట్టారు.దేశంలో ఇండియా కూటమి ఏర్పాటులో సిపిఐ (యంయల్) లిబరేషన్ కీలకపాత్ర పోషించిందని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రజల హక్కులను కాపాడేందుకు ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 17 సీట్లలో ఇండియా కూటమి (కాంగ్రెస్) ను బలపరుస్తున్నామని తెలిపారు.  ఫాసిస్టు శక్తులను ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ  జిల్లా నాయకులు బానోత్ శ్రీను, దిగజర్ల  శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన