కాంగ్రెస్ గూటికి కూసుమంచి ఎంపీపీ

- వైస్ ఎంపీపీ సహా పలువురు సర్పంచ్ లు, పలువురు నాయకులు -- బీఆర్ఎస్ కు భారీ షాక్

కాంగ్రెస్ గూటికి కూసుమంచి ఎంపీపీ

ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మే 02: ఈ మండలంలో బీ ఆర్ ఎస్ కు పెద్ద్ షాక్ తగిలింది. ఆ పార్టీ నియంత పోకడలు నచ్చట్లేదు అని కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఎం పీ పీ బానోత్ శ్రీనివాస్ నాయక్ కు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆహ్వానించారు. గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని సాయి గణేష్ నగర్ పార్టీ కార్యాలయం లో ప్రసాద్ రెడ్డి సమక్షంలో వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ తో పాటు పలువురు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరారు. బీ ఆర్ ఎస్ విధానాలు, పై  నాయకుల పోకడలు నచ్చక తాము బయటకు వచ్చినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..శ్రీనన్న ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాo రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించుకుంటాని కొత్తగా పార్టీ లో చేరిన నాయకులు అన్నారు.
బీ ఆర్ ఎస్ నుంచి ..: 
బీ ఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు చాట్ల పరుశురాం కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా
  రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బానోత్ రామ్ కుమార్,  తాజా, మాజీ సర్పంచ్ లు ములకూరి శ్యామ్ సుందర్ రెడ్డి, బానోత్ నాగేశ్వరావు, బానోత్ మమత, బాధవత్ బీబ్లీ, ఎంపీటీసీ బాధవత్ మంగ్యా, జహంగీర్ షరీఫ్, మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి, నాయకులు బాధవత్ శంకర్, మంగీత్య, శ్రీను, కందిబండ శ్రీధర్, చిలకబత్తిన నాగరాజు, బానోత్ కిషన్ తదితరులు ఉన్నారు.

Tags:
Views: 27

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి