ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు

ఫిర్యాదు చేసిన పట్టించుకోని రెవిన్యూ అధికారులు .. విలేకరుల సమావేశంలో ఆర్టీఐ కార్యకర్త బుర్ర సైదారావు గౌడ్

ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01 : ఖమ్మం అర్బన్ పరిధిలోని 58వ డివిజన్ దొరన్నకాలనీ లో కాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టి అమ్ముకుంటున్న అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు దపాలుగా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆర్.టి.ఐ కార్యకర్త బుర్ర సైదారావు గౌడ్ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 58వ డివిజన్ దొరన్న కాలనీ వాసులతో కలసి బుర్ర సైదారావు గౌడ్ మాట్లాడారు. 
    ఖమ్మం అర్బన్ పరిధిలోని 58వ డివిజన్ ధరన్న కాలనీలో 2012 సంవత్సరంలో నిరుపేదలైన ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారన్నారు. కాగా 2021వ సంవత్సరంలో ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ప్రాంతంలో 12 ప్లాట్లు ఖాళీగా ఉండడంతో కొందరు అక్రమార్కులు ఆ భూములపై కన్నేసి నిర్మాణాలు చేపడుతున్నారు అనంతరం అమ్ముకుంటున్నారన్నారు. కాలనీవాసులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మద్దెల అఖిల్, నారపోగు శేఖర్, షేక్ సోంధుమియా, మున్నేన జగన్, బచ్చలకూర గురుమూర్తి, రాఘవరపు వెంకటేశ్వర్లు, కొలిపాక వెంకట్, యడ్ల శేషగిరి, విజయ్, శ్రీహరి, కోటి, గణేష్, పాపారావు, ఎస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 13

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి