అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.

పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వి. పి గౌతమ్

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పీవో, ఏపీవో, ఓపివో లకు చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో పిఓ, ఏపిఓ, ఓపిఓల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఈవీఎం మెషిన్ ల నిర్వహణ, మాక్ పోల్, పిఓ డైరీ, 7ఏ, 7సి, బుక్ లెట్ సరిగా పూరించి, ఎన్నికలను విజయవంతం చేయాలని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ మొదలు పెట్టాలని, రాజకీయ పార్టీల పోలింగ్ ఎజెంట్స్ రాకుంటే పదిహేను నిముషాలు వేచిచూసి కచ్చితంగా ఉదయం 5:45 గంటలకు మాక్ పోలింగ్ చేపట్టాలని, ఎలాంటి తప్పులు లేకుండా ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలన్నారు. పీవో, ఏపీవో, ఓపివో లు జట్టుగా ఏర్పడి, ఎవరు పోలింగ్ అధికారి-1, ఎవరు పోలింగ్ అధికారి-2 ల విధులు నిర్వర్తించాలో నిర్ణయించుకోవాలన్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసుకొని, ఎక్కడ ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్, ఏఎల్ఎంటీలు, అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి