రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.

మోడీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇండియా కూటమిని గెలిపిద్దాం--సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. రామ సహాయం రఘురామిరెడ్డి విజయం కాంక్షిస్తూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం.

రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు.  రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి.  మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం.  బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.

ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మే 09: సిపిఐ సిపిఎం టీజేఎస్ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేస్తున్న రఘురాంరెడ్డి గెలుపును మతతత్వ శక్తులకు దానికి పరోక్షంగా సహకరించే శక్తులు అడ్డుకోలేవని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. రామ సహాయం రఘురామిరెడ్డి విజయం కాంక్షిస్తూ గురువారం పట్టణంలోని పలు వార్డులలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను మోసం చేసిన మోడీ ప్రభుత్వంనికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్దాంగా ఉన్నారు అని, పదేళ్ల మోడీపాలన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడంతోనే సాగిందని అన్నారు. కులాలు, మతాలమధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. మతతత్వ కార్పొరేట్ పార్టీలను తెలంగాణలో అడుగుపెట్టనీయబోవని అన్నారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటు సాక్షిగా బిజెపి ప్రభుత్వం తెస్తుంటే పరోక్షంగా సహకరించిన టిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని ప్రజలు అప్రమత్తంగా ఈ దేశ ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం పాటుపడే ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ అధికారం చేపట్టిన తరవాత అనేక పోరాటాలుతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు, కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని 20 సంవత్సరాల దేశ అభివృద్ధిని వెనక్కి నెట్టారని ఆరోపించారు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ప్రతి బూతులో ప్రతి ఓటర్లు కలిసి మోడీ నిరంకస పాలనపై చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సిపిఎం పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు మండల కార్యదర్శి వీశంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు  ఉప్పుశెట్టి రాహుల్, అన్నారపు వెంకటేశ్వర్లు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, శనగారపు శ్రీనివాసరావు, మడుపు ఉపేంద్ర చారి, వై వెంకట్రామయ్య, జకరయ్య, వైయస్ గిరి, ఎస్ కె పాషా, సాయి, గాలి పద్మ లక్ష్మి, అన్నారపు అశోక్, సురేష్, సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి