బీఆర్ఎస్, బీజేపీని ఏడు కండేల లోతులో పాతేద్దాం

- కుట్రలు ఒకరివి, మత విద్వేషాలు మరొకరివి - దమ్మాయి గూడెం ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి - రఘురాంరెడ్డితో కలిసి ప్రచారం

బీఆర్ఎస్, బీజేపీని ఏడు కండేల లోతులో పాతేద్దాం

ఐ ఎన్ బి టైమ్స్ తిరుమలాయపాలెం 02: ఈ లోక్ సభ ఎన్నికల్లో బీ ఆర్ఎస్, బీజే పీలను ఏడు కoడేల లోతులో పాతిపెడదామనీ రాష్ర్ట రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మాయ మాటలు చెబుతూ.. బీ ఆర్ఎస్ఎస్ పదేళ్లు కాలం వెళ్లదీసింది అని అన్నారు. అప్పుడు దోచుకొని, అంతా దాచుకొని ఇప్పుడు తమ సర్కారు పై కే సీఆర్ విమర్శలు చేస్తున్నాడు అని న్నారు. ప్రాజెక్టుల పేరుతో ఖజానా అంతా తన ఇంట్లోకి పంపుకున్నాడు అని ఆరోపించారు.నాగార్జున సాగర్‌ నీటిని ప్రక్క రాష్ట్రానికి తరలించి రైతుల పంటలు ఎండేలా చేశాడని అన్నారు. బస్సు యాత్ర పేరిట కర్ర పట్టుకొని తిరుగుతూ.. కళ్లబొల్లి మాటలు చెబుతున్నాడు అని అన్నారు. మిషన్‌ భగీరథ పథకం లో భారీ అవినీతికి పాల్పడ్డాడు అని తెలిపారు. అప్పుడు యూనిట్ విద్యుత్ ను పక్క రాష్ట్రాల నుంచి రూ.20కు పైనే పెట్టీ కొని..సొమ్ము దోచుకున్నారు అని, తమ సర్కారు రూ.3.50 కే కొంటోంది అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని, ఏ పల్లె లో కూడా మంచినీటి సమస్య రానియ్యమని మంత్రి పొంగులేటి అన్నారు.  బీజేపీతో దోస్తీ కట్టిన బీఆర్ఎస్.. కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమను విస్మరించింది అని, అధికారంలో ఉన్నప్పుడు  కేసిఆర్‌ ఒత్తిడి తేలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రశ్నిస్తే జైలుకి పోతాడనే భయం ఆయనలో ఉంది అని అన్నరు. పగలేమో విమర్శలు, రాత్రి కేమో బీ జేపీ తో మంతనాలు చేస్తుంటారు అని ఆరోపించారు. ఖమ్మం సభలో నామాను గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తానని కేసీఆర్‌ అన్నారని, తద్వారా వారి రహస్య స్నేహం బట్టబయలు అయిందని చెప్పారు. అధికారంలోకి వస్తే హిందువుల మంగళసూత్రాలు ముస్లీంలకు ఇస్తారని బీ జేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, మత విద్వేషాలు రెచ్చగొడుతోంది అని తెలిపారు. ప్రజా సేవ కోసం పోటీ చేసిన రఘురాo రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరి సమన్వయంతో పనిచేస్తా: రఘురాం రెడ్డి  ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి, రాజ్య సభ సభ్యురాలి సమన్వయంతో అభివృద్ధికి పాటు పడతా అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయo రఘు రాం రెడ్డి అన్నారు. దొంగ మాటలు చెప్పే బీ ఆర్ఎస్, బీజేపీ లను నమ్మొద్దు అని కోరారు. మాజీ ఎం పీపీ కొప్పుల అశోక్ కు పరామర్శ..: తిరుమలాయపాలెం లో మాజీ ఎం పీపీ కొప్పుల అశోక్ నివాసానికి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం వెళ్లి ఆయన ను పరామర్శించారు. జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు రామ సహాయం నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, ఎంపీపీ మంగీలాల్, వైస్‌ ఎంపీపీ బుద్దా వంశీకృష్ణ, సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, సీపీఐ మండల కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 28

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి