కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించండి ఎయిర్ పోర్ట్ సహా భారీ పరిశ్రమలు తీసుకొస్తాo

కాంగ్రెస్ చేతిలో మరోసారి మోసపోకండి బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్ బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు

కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించండి ఎయిర్ పోర్ట్ సహా భారీ పరిశ్రమలు తీసుకొస్తాo

ఐ ఎన్ బి టైమ్స్ కొత్తగూడెం మే 08 : ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అందులో కొత్తగూడెం, ఖమ్మం ఉండాలంటే బిజెపి ఎంపీ ని గెలిపించాలని పలువురు వక్తలు కోరారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి బస్తర్ మహారాజు, కాకతీయ వంశ వారసుడు మహారాజా కమలచంద్ర భంజ్ దేవ్, బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు, బిజెపి నాయకులు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి మధ్య మధ్యలో ప్రచార రధం దిగి దుకాణదారులను, ఇళ్లలోకు వెళ్లి ఓట్ల అభ్యర్థించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్ మాట్లాడారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో లోకల్ పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈసారి బిజెపి కి ఇవ్వాలని కోరారు. నా మిత్రుడు వినోద్ రావు కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని మీరు ఆశీర్వదించాలని కోరారు. ఆయనను గెలిపించిన తర్వాత రెండేళ్లలోపు అర్హులైన ప్రతి ఇంట్లో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మీ ఇంటికి అందజేస్తారని తెలియజేశారు. కట్టెల పొయ్యితో బాధపడుతున్న మహిళలకు బిజెపి ఉజ్వల పథకం కింద రాయితీ గ్యాస్ అందించారన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు వాగ్దానాలతో ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులను మా రాష్ట్రమైన ఛత్తీస్గడ్లో ఒక్క ఓటు దెబ్బతో వారిని ఇంటికి పంపించారని అక్కడి ప్రజలను మెచ్చుకున్నారు. భారతదేశంలో ఎటువంటి సంక్షోభం వచ్చిన ప్రధాన మంత్రి మోడీ వెనక్కి తగ్గేది లేదని సరిహద్దుల్లో సైతం శత్రువులను గడ గడ లాడించారని, కరోనా సమయంలో ఆ పార్టీ ఈ పార్టీ లేదని కాంగ్రెస్ వారికి సైతం ఉచితంగా కరోనా కట్టడి వ్యాక్సిన్ అందించినట్లు గుర్తు చేశారు. నా పేరు కమల్ అని పోలింగ్ రోజున కమలం పువ్వు గుర్తు బటన్ నొక్కితే నన్ను ఆశీర్వదించినట్లేనని ఇది బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద రావు గెలుపుకు దోహదపడుతుందన్నారు* 
బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు మాట్లాడుతూ... కొత్తగూడెం ప్రజల్ని చూస్తుంటే 1000 ఏనుగుల బలం వస్తుందన్నారు. మనతోపాటు మన ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నారు. ప్రధానమంత్రి మోడీ ని అడిగి మంచి ఆసుపత్రి, ఐటీ హబ్, తెచ్చుకుందామన్నారు. కేటీపీఎస్ మూతపడుతుందని దాని పునర్ వైభవానికి కృషి చేస్తానని చెప్పారు. సింగరేణి కూడా విస్తరించాలన్నారు . ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చి రవాణా సౌకర్యం మరింత మెరుగుపరుస్తానని తెలిపారు. దేశంలో సంక్షోభాలు, కరోనా సమస్య వచ్చిన ప్రధాని మోడీ ప్రజల మధ్యలో ఉండి పాలన చేశారని గుర్తు చేశారు. నా ఎన్నికల ప్రచారానికి వచ్చిన బస్తర్ మహారాజ్ కమలచంద్ర ఖమ్మం సమస్య ను వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయం తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ మాట్లాడుతూ మే 13వ తేదీన ఈవీఎం బ్యాలెట్ నాలుగో నెంబర్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని కొత్తగూడెం ప్రజలను విజ్ఞప్తి వేశారు సీనియర్ రాజకీయ నాయకులు జి వి కే మనోహర్ మాట్లాడారు. బొగ్గు పరిశ్రమ రోజురోజుకు నిర్వీర్యం అవుతుందని, కేంద్ర ప్రభుత్వంతో దానిని రక్షించాలంటే బిజెపి ఎంపీ గెలవాలన్నారు. ఈ రోడ్ షోలో పార్టీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ బిజెపి సీనియర్ జి వి కే మనోహర్, మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి