మున్నేరు సీసీ ప్రొటెక్షన్ వాల్

నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి తుమ్మల

మున్నేరు సీసీ ప్రొటెక్షన్ వాల్

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 03: ఉదయం మున్నేరుకి ఇరువైపులా నిర్మిస్తున్నసీసీ ప్రొటెక్షన్ వాల్ పనులపై నిర్మాణ సంస్థ  ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ,సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు... మంత్రి తుమ్మల సూచనలు: నదిని రక్షించుకుంటూనే నదికి ఇరువైపులా గృహాలు నిర్మించుకున్న వారితో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలి....ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం వలన మున్నేరు కి ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనెలాగ నిర్మాణం చేపట్టాలి....వాల్ నిర్మాణం ప్రారంభం అయ్యే గోళ్ళపాడు ఆనకట్ట నుండి చివరి ప్రకాష్ నగర్ ఆనకట్ట వరకు నిత్యం నీరు నిలువ వుండేలా చర్యలు తీసుకోవాలి,అవసరమైతే మధ్యలో చిన్న చిన్న చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలి....ఖమ్మంలో నానాటికి  పెరుగుతున్న  ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని బైపాస్ రోడ్డు నుండి ప్రకాష్ నగర్ బ్రిడ్జీ వరకు ప్రొటెక్షన్ వాల్ ను అనుకుని డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.....వాల్ నిర్మాణం వలన తలెత్తే డ్రైనేజీ సమస్యల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీర్లతో చర్చించి సమస్యల పరిష్కారం చేసుకోవాలి....అంతే కాకుండా రోడ్లు భవనాల శాఖ,పంచాయితీ రాజ్,ఇరిగేషన్,విద్యుత్,పోలీస్,కేబుల్స్ విషయంలో బిఎస్ఎన్ఎల్ వంటి అన్ని శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేసి వాల్ నిర్మాణం వలన భవిష్యత్తులో నగరం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని సూచించారు....నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని కలక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.....

Tags:
Views: 14

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి