మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి

మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..:  కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ  -  కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి

ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మే 09: పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి కూసుమంచి మండలంలో బిగ్ షాక్ తగిలింది. ఆయన రైట్ హ్యాండ్ గా ఉన్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, రాజుపేట నివాసి, రాజుపేట ఎంపీటీసీ మోదుగు వీరభద్రం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్య అనుచరులైనా ఎంపీపీ బానోతు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరగా , ఈ రోజు ఎంపీటీసీతో పాటు ఉప సర్పంచ్ కూడా పార్టీలో చేరడంతో కూసుమంచి మండలంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కూసుమంచి మండలంలోని పెరిక సింగారం రాజుపేట రాజుపేట బజార్ ఎంపీటీసీ సభ్యులు రాజుపేట గ్రామ ఉపసర్పంచ్ ఉప్పల వీరభద్రం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి  సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్,సి డి సి మాజీ చైర్మన్ జూకూరు గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, బజ్జూరు వెంకటరెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరశురాం తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 49

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి