కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.

కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక.  --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే.  --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి.  --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.


ఐ ఎన్ బి టైమ్స్ కొత్తగూడెం మే 09: లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీకి చెందిన లగడపాటి రమేష్ చంద్, తేలిక పుల్లయ్య, గంపల రవీందర్, సుజాతనగర్ మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీకి చెందిన మూడ్ భీమ్లా, కొర్ర శ్రీను, బాబూలాల్, కొత్తగూడెం మున్సిపాలిటీ 28, 30వ వార్డులకు చెందిన దాసరి శ్రీను, జె శ్రీనివాస్, తాడూరి రుక్మిణి, కోరి దేవి, సాగరపు వెంకటలక్ష్మి నేతృత్వంలో మూడు ప్రాంతాలకు చెందిన 130 కుటుంబాలు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా సమక్షంలో గురువారం 'శేషగిరిభవన్'లో జరిగిన సమావేశంలో  సిపిఐలో చేరారు, వీరికి పార్టీకండివా కప్పి ప్రాధమిక సభ్యత్వాన్ని నాయకులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవలందించే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని, సిపిఐ సేవలను గుర్తించి ఇటీవల వందలాదిమంది వివిధ పార్టీల నుంచి సిపిఐలో చేరారని, వారి నమ్మకానికి అనుగుణంగా సమస్యల పరిస్కారంకోసం కృషిచేస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిస్కారమే సిపిఐ ఏకైక అజెండా అని అందుకోసం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, జక్కుల రాములు, పిడుగు శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, పల్లపోతు సాయికుమార్, తాళ్ల వెంకటేశ్వర్ రావు, యూసఫ్, బానోత్ గోవిందు, బత్తుల సురేష్, నేరెళ్ల రమేష్, రత్నకుమారి, భూక్యా శ్రీను, మంగియా తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన