పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్

పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అశోకా ఆన్‌లైన్ అకాడమి వ్యవస్థాపకులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పాలకూరి అశోక్‌కుమార్ తెలిపారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు చెందిన తాను అనేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ, సామాజిక ఉద్యమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. 15 సంవత్సరాలు ప్రముఖ దినపత్రికల్లో జర్నలిస్టుగా, పది సంవత్సరాలు లెక్చరర్‌గా పని చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ చర్రిత, తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్రలను లక్షలాది మందికి బోధించిన అనుభవం ఉందన్నారు. ప్రభుత్వ టీవి ఛానల్ టి-శాట్, మన టివిలో నిరుపేద విద్యార్థులకు బోధించినట్లు తెలిపారు. అశోకా ఆన్ లైన్ అకాడమీ స్థాపించి ఆన్‌ లైన్ లో తక్కువ ఫీజుతో నిరుపేద విద్యార్థులకు కోచింగ్ ఇచ్చినట్లు తెలిపారు. సామాజిక ఉద్యమాలు చేపట్టిన సందర్భంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై 12 క్రిమినల్ కేసులు నమోదు చేసిందన్నారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపినట్లు తెలిపారు. ప్రతి నిరుద్యోగ ఉద్యమంలో తాను పాలుపంచుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం లాగానే ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో డిఎస్‌సి, గ్రూపు-2 పోస్టులు పెంచాలని, టెట్ నోటిఫికేషన్ వేయాలని, గురుకుల పోస్టులు మిగలకుండా సంపూర్ణంగా నింపాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి విజయం సాధించినట్లు తెలిపారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తనకు ప్రథమ ప్రాథాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Tags:
Views: 7

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి