వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్

బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కారేపల్లి లో భారీ రోడ్ షో గిరిజన సంప్రదాయాలతో ఆహ్వానం

వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం  లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు  బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్

ఐ ఎన్ బి టైమ్స్ కారేపల్లి మే 09: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇస్తున్న నిధులతో ఖమ్మం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ను గెలిపించాలని, గతంలో అనేక పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈ ఒక్కసారి బిజెపికి ఓటు వేయాలని పలువురు వక్తలు కోరారు. వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం కారేపల్లి లో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయాలతో మహిళలు నేతలకు స్వాగతం పలికారు. ఈ రోడ్ షో లో కాకతీయ వంశ 22 వ వారసుడు మహారాజా కమలచంద్ర భంజ్ దేవ్ కాకతీయ మాట్లాడారు. భారతదేశంలో అన్ని ప్రాంతాలు  బాగుండాలని గట్టిగా భావించే మోడీ ఆధ్వర్యంలో సబ్ క సాత్ సబ్ కా వికాస్ జరుగుతున్నదని చెప్పారు.  అందుకు పెద్ద ఉదాహరణగా కరోనా సమయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఉచితంగా కరోనా నివారణ వ్యాక్సిన్ పంపిణీని ఆయన ప్రస్తావించారు. బిజెపి ప్రభుత్వం మహిళా సంక్షేమ కోసం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా కట్టెల పొయ్యి మీద వంట చేయకుండా  ఉజ్వల స్కీం కింద గ్యాస్ కనెక్షన్లు, రాజకీయ భాగస్వామ్యంలో భాగంగా 33 శాతం రిజర్వేషన్, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు కట్టించారని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందజేయడం జరుగుతుందన్నారు. సురక్షిత నీరు పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇంటింటికి మంచి నీరు అందజేయడం జరుగుతుందన్నారు. రైతుల ఇబ్బందులు మోడీ గారికి తెలుసని ఒక్క బటన్ నొక్కి రైతులందరికీ రుణాలు అందజేశారని తెలిపారు. నాలుగు రోజుల నుంచి ఇక్కడ ప్రచారంలో తిరుగుతున్న నా మిత్రుడు వినోద రావుకు ప్రజల నుంచి లభించిన స్పందన అపూర్వమన్నారు. కాంగ్రెస్ పార్టీ లూటీ చేసే పార్టీ అని, దాన్ని నమ్మవద్దని హితవు పలికారు. వినోద్ రావుకు ఓటు వేస్తే మోడీ గారికి ఓటు వేసి నట్లేనని, ఆయనను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

*బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ... తనకు వేసే ఓటు అభివృద్ధికి, న్యాయానికి, ధర్మానికి వేసే ఓటు చెప్పారు.  పదేళ్ల నుంచి సామాజిక సేవ చేస్తున్న తాను మోడీ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానని అన్నారు. సొంత గడ్డను అభివృద్ధి చేసి ఈ గడ్డ రుణం తీసుకోవాలన్న సంకల్పంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలందరం  ప్రశాంతంగా ఉన్నామంటే దేశ సురక్షిత, భద్రత కోసం మోడీ తీసుకున్న కృషి వల్లేనని చెప్పారు. అయోధ్య రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో 500 ఏళ్ల హిందువుల కల సాకారమైందన్నారు. దేశం అభివృద్ధి పథంలో  వెళ్తుంటే
పదేళ్లలో ఖమ్మం ఏమైనా అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు.  ప్రతి ఒక్కరికి ప్రభుత్వ వైద్యం ముఖ్యమని చెబుతూ ఈ ప్రాంతంలో ఏమైనా పెద్ద ఆసుపత్రులు ఉన్నాయా, ప్రతి చిన్న వైద్యం కోసం ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు అని ప్రశ్నించారు. మోడీ సైనికుడిలా పనిచేసి ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తానని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే వారి కుటుంబ సంక్షేమ కోసం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ లో కుటుంబ పాలన ఉంటుందనీ, ఒక మంత్రి వియ్యంకుడికి టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కృష్ణ రాథోడ్, శ్యామ్ రాథోడ్, డాక్టర్ శీలం పాపరావు, కోటేశ్వరరావు వీరన్న రామారావు, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మాచర్ల క్రాంతి, టిడిపి, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:
Views: 12

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన