రిజిస్ట్రేషన్ భూమిని ఆక్రమించేందుకు కుట్ర

పలుమార్లు కోర్టుకు వెళ్లిన తీర్పు మావైపే , ఆక్రమణదారులతో ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి విలేకరుల సమావేశంలో బాధితుడు వాసిరెడ్డి శ్రీనివాసరావు

రిజిస్ట్రేషన్ భూమిని ఆక్రమించేందుకు కుట్ర

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 03 : తమకు చెందిన రిజిస్ట్రేషన్ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వ్యక్తులు మాపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అటువంటి వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగరానికి చెందిన బాధితుడు వాసిరెడ్డి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మా నాన్నగారైన వాసిరెడ్డి నాగేశ్వరరావు 1997లో వెలుగుమట్ల సర్వేనెంబర్ 494లో ఓబుల్ రెడ్డికి చెందిన రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. ఓబుల్ రెడ్డికి ఉన్న మొత్తం 10 ఎకరాల్లో మా కుటుంబం 2 ఎకరములు, కోనా శారద 4 ఎకరములు, మిగిలిన 4 ఎకరములు 2005లో ఓబుల్ రెడ్డి వారసులైన రాములమ్మ, కొండారెడ్డి, వెంకట సుమతి, భారతి ప్లాట్లు చేసి ఐదుగురికి అమ్మేరు. అమ్మే క్రమంలో మాకు తెలియకుండా మేము కొనుగోలు చేసిన రెండెకరాలకు కూడా డిక్లరేషన్ చేసి ఇచ్చారు. 2007లో అనుమోలు భాస్కరరావు, రాంప్రసాద్ అనేవారు అక్రమంగా జిపిఏ పొంది మాభూమిలో కూడా వెంచర్ వేసేందుకు ప్రయత్నించగా కోర్టుకు వెళితే 2013లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. వారి నుండి మరలా అదే భూమిని చేపూరి సంధ్యారాణి, చేపూరి పద్మలు కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2013లో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వస్తే 2019లో కోర్టు కొట్టువేసి మాకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఓబుల్ రెడ్డి వేలిముద్రలు ఫోర్జరీ చేశామని కేసువేసి వేదిస్తే మా డాక్యుమెంట్స్ పరిశీలించి 2017లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మా రెండు ఎకరాల భూమికి ఫెన్సింగ్ వేసిన తొలగిస్తున్నారు. సంధ్యారాణి పద్మల స్వగ్రామం బయ్యారం వారిపై అనేక కేసులు ఉన్నాయని, బీసీలు అయి ఉండి అక్రమ పద్ధతిలో ఎస్సీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఎంపీపీగా ఎన్నికైతే కలెక్టర్ ఆ పదవిని రద్దు చేశారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తాసిల్దారును కూడా సస్పెండ్ చేశారు. వారి వలన మా కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని, అదేవిధంగా మా భూ పత్రాలు, కోర్టు తీర్పులు పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు. విలేకరుల సమావేశంలో మీగడ వెంకటకృష్ణ, ముళ్ళ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 18

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి