అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు కలిసి నడుద్దాం... జూలకంటి బ్రహ్మానందరెడ్డి

అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు కలిసి నడుద్దాం... జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల మార్చి 27 : అవినీతి పరమావధిగా రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించిన వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు కలసి ఉద్యమించాలని మాచర్ల నియోజకవర్గ టిడిపి,జనసేన,బిజెపి ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మాచర్ల పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పథంలోకి నడవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని అన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని టిడిపి,బిజెపి, జనసేన కలసి పనిచేయాలని నిశ్చయించుకున్న విషయాన్ని వారికి వివరించారు. క్షేత్రస్థాయిలో  టిడిపి,బిజెపి,జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. ఏ కార్యక్రమం చేపట్టిన అందర్నీ కలుపుకొని రావాలన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలకు త్రాగునీరు, సాగునీరు,విద్య,ఆరోగ్యం,మౌలిక వసతులు, ఉద్యోగ,ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గుంపు గుత్తుగా ఉమ్మడి అభ్యర్థికే పడేవిధంగా కృషి చేయాలని.అందుకు అనుగుణంగా బూత్ లెవెల్ లో కార్యకర్తలను చైతన్య పరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు,జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు,జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ యాదవ్, ఒంగోలు జిల్లా ఇంచార్జ్ రవిశంకర్,మాచర్ల బిజెపి కన్వీనర్ గుమ్మడి నాసరయ్య, శెట్టిపల్లి హనుమంతరావు,సురేష్, వెండిదండి శ్రీనివాసరావు,జనసేన నాయకులు బూస రామాంజనేయులు, నక్షత్ర ప్రసాద్,పులిహరి,తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 1

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..:  కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ  -  కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మే 09: పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి కూసుమంచి మండలంలో బిగ్ షాక్ తగిలింది....
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం