రాముడే దేవుడు..

రాముడే దేవుడు..

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాచలం ఏప్రిల్ 16: రాముని మించిన దైవం లేదంటూ యావద్భారత దేశంలో మానవులంతా  రామభజనలతో తన్మయులయ్యే మహాపర్వదినం  శ్రీరామనవమి నేడు.. అంటే ఏప్రిల్ 17న.  పునర్వసు నక్షత్రంతో చైత్ర శుద్ధ నవమి నాడే శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు.  ఆగమశాస్త్రం ప్రకారం దేవతల పుట్టినరోజు నాడే కల్యాణం జరిపించాలి.. శాంతి కల్యాణం అంటారు.  శాంతి స్వరూపిణి అమ్మవారు తోడైతే దేవుడు మరింత శక్తివంతుడు అవుతాడు.  అందుకే దేవాలయాలలో ఏటా కల్యాణాలు జరుపుతుంటారు.  సమస్త మానవాళికి శాంతి చేకూరాలని.  వసంత నవరాత్రులుగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ఉత్సవాలు జరిపి నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపితే విశ్వశాంతి, లోకక్షేమం.    ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ లభిస్తుంది.  అందుకే శ్రీరామనవమి నాటి కళ్యాణం తరువాత వాన చినుకులు పడటం  పరిపాటి.  కుదిరితే చాలా పెళ్ళిళ్ళ ముహూర్తాలు శ్రీరామనవమి నాటి సీతారామ కళ్యాణం తరువాతే పెట్టుకుంటారు.  అంతటి ప్రాధాన్యత గల ఈవెంట్ సీతారామ కళ్యాణం.  ఇక చాలా ప్రాంతాల్లో తొమ్మిది రోజుల వేడుకగా శ్రీరామనవమి జరుపుకుంటారు.  తాటాకు పందిళ్ళు, మేళతాళాలు, ప్రత్యేక పూజలు, రామభజనలు, రామాయణ పఠనం, కోలాటాలు, చెక్క భజనలతో ప్రతి రామాలయంలో శ్రీరామ నామ స్మరణతో సందడి వాతావరణం నెలకొంటుంది.  వేదమంత్రాలతో ఆలయ మంటపాలు హోరెత్తుతాయి.  తెల్లని ముత్యాల తలంబ్రాలు శుభప్రదమని కల్యాణ వేడుక తర్వాత వచ్చినవారందరికీ పంచుతారు.  హిందూ వివాహ వ్యవస్థకు పట్టుగొమ్మలు సీతారాములు.  ఆదర్శ దంపతులంటే సీతారాములే.  అనురాగానికి అన్యోన్యతకు మారుపేరు వీరి దాంపత్యం.  మంచితనంలో శ్రీరాముని మించిన వారెవ్వరూ లేరు.  అందుకే రాముడు మంచి బాలుడు అని ఎలిమెంటరీ పాఠశాలలో మనచేత కాపీ రాయించారు.  శ్రీరాముని జీవితమే మనందరికీ ఆదర్శం.  రామాయణం నుంచి నేర్చుకో వలసినవి చాలా ఉన్నాయి.  శ్రీరామునికి సంబంధించి గ్రంథాలు కావ్యాలు కథలు సినిమాలు పాటలు ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి.  ఎంత చదివినా ఎంత విన్నా..  ఇంకా ఇంకా చదవాలని వినాలని అనిపిస్తుంది శ్రీరామ వృత్తాంతం.  నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుందాం.  మనందరికీ శ్రీరాముని ఆశీస్సులు దీవెనలు నిండుగా లభిస్తాయని ఆశిద్దాం.  అందరికీ శ్రీరామనవమి పర్వదినం శుభాకాంక్షలు..  -

Tags:
Views: 8

About The Author

INB Picture

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి