బాండ్ల నగదు చెల్లింపులో జాప్యమెందుకు.....?

ఆర్టిసి కార్మికుల మనో భావాలతో ఆటాడుతున్న యాజమాన్యం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అప్పారావు

బాండ్ల నగదు చెల్లింపులో జాప్యమెందుకు.....?

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 28: ఆర్టిసి యాజమాన్యం కార్మికుల పట్ల వివక్షా పూరిత ధోరణి అవలంభిస్తుందని బాండ్లకు సంబంధించిన నగదు చెల్లింపులో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల చెల్లింపుకు సంబంధించి రూ. 281 కోట్లను విడుదల చేసి 40 రోజులు గడుస్తున్నా కార్మికులకు నగదు ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం రీజియన్ అత్యవసర సమావేశం గురువారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగింది. రీజియన్ కార్యదర్శి పిల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాటి అప్పారావు మాట్లాడుతూ బాండ్ల చెల్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఆర్టిసి యాజమాన్య వైఖరి ఉందని కొంత భాగాన్ని సీనియార్టి ప్రకారం చెల్లిస్తామని చెప్పినా ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు. ఎందుకు చెల్లించడం లేదో యాజమాన్యం కార్మికులకు తెలియజేప్పాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కార్మికుల మనోభావాలతో యాజమాన్యం ఆటలాడుతుందని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అప్పారావు పిలుపునిచ్చారు. యాజమాన్యం స్పందించక పోతే ఆందోళనను ఉదృతం చేస్తామన్నారు. తొలిదశలో డిపో మేనేజర్లకు వినతి పత్రాలు అందజేస్తామని అప్పటికి యాజమాన్య వైఖరిలో మార్పు రాకపోతే ఆందోళన చెపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డిపో అధ్యక్ష, కార్యదర్శులు డి. జగన్నాథం, వి. బుచ్చిబాబు, ఖమ్మం రీజియన్ పరిధిలోని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు గోపాలరావు, నాగులమీరా, రఘురాం, రాంబాబు, ఆర్. నాగేంద్రసింగ్, కె. నాగభూషణరావు, రాయప్ప, సుందరం, రమణారావు, మధు, పవన్, లాజర్, హరినాథ్ బాబు, రమాదేవి, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం