డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !

డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !

బీజేపీ, జేడీఎస్‌ల పొత్తు ఫలితంగా జేడీఎస్ దక్కించుకున్న మండ్య లోక్ సభ నియోజకవర్గం నుండి చివరి వరకు బీజేపీ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ మార్చి 30వ తేదీన బెంగళూరులోని ఆమె నివాసంలో మళ్లీ అభిమానలతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మార్చి 30వ తేదీన సుమలత డెడ్ లైన్ విధించారని తెలిసింది. బీజేపీ హైకమాండ్ సుమలత అంబరీష్‌కి మండ్య ఎంపీ టిక్కెట్‌ ఇస్తుందని అందరూ భావించారు. కానీ మండ్య నియోజక వర్గం జేడీఎస్ కు ఇచ్చేశారు. ఈ దెబ్బతో సుమలత నిరాశకు గురైనారు. సుమలత అంబరీష్ తదుపరి రాజకీయ ఎత్తుగడపై మౌనంగా ఉన్నారు. దీనికి సంబంధించి మండ్య ఎంపీ సుమలత అంబరీష్ ఓ నిర్ణయం తీసుకునేందుకు బెంగళూరులోని నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. బంధువులు, కార్యకర్తలు, అంబరీష్ అభిమానుల నుంచి అభిప్రాయాలను సేకరించి దాని ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఆ భేటీ తర్వాత సుమలత తదుపరి రాజకీయ ఎత్తుగడ తేలిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. కర్ణాటకలోని 14 నియోజకవర్గాలకు నేటి నుంచి నామినేషన్ పత్రాలు ప్రారంభం కావడంతో పలు జిల్లాల్లో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి తరువాత వారితో చర్చించి మండ్యలో తటస్థంగా ఉండాలా? లేదా పోటీ చెయ్యాలా ?, లేదా జేడీఎస్ కు మద్దతు ఇవ్వాలా అని సుమలత ఓ నిర్ణయానికి వస్తారని తెలిసింది. మండ్యలో స్వతంత్ర పార్టీగా పోటీ చేస్తే నిలదొక్కుకోవడం సాధ్యం అవుతుందా, దాని సాధకబాధకాలు, గెలుపు, ఓటములు, గెలుపుపై లెక్కలు వెయ్యాలని సుమలత ఆలోచిస్తున్నారని తెలిసింది. లేదంటే బీజేపీ నేతల సూచనల మేరకు మండ్యలో జేడీఎస్ అభ్యర్థికి మద్దుతు తెలిపాలా ? పలు అంశాలపై సుమలత చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల సుమలత మండ్యలో కార్యకర్తల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన వైఖరిని తర్వాత ప్రకటిస్తానని ఆసమావేశంలో సుమలత చెప్పారు. ఇప్పుడు సుమలత అంబరీష్ ఎత్తుగడ ఏంటో ఈ నెలాఖరులోగా తేలిపోనుంది. సుమలత తదుపరి రాజకీయ ఎత్తుగడ, ఆమె నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సుమలత ఎత్తుగడలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన సుమలత జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో సుమలతకు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో ఆమె విజయం సాధించారు. ఇప్పుడు అదే బీజేపీ రివర్స్ కావడంతో సుమలత అయోమయంలో పడిపోయారు.సుమలతకు మంచి గౌరవ హోదా ఇస్తామని బీజేపీ-జేడీఎస్ కూటమి ఇప్పటికే ఆమెకు హామీ ఇచ్చింది. మండ్యలో గెలవడం జేడీఎస్‌కు పరువు ప్రతిష్టగా మారింది. దీంతో సుమలత మళ్లీ పోటీ చేస్తే ప్రజల మద్దతు లభించడం దాదాపు అనుమానమే. అందుకే ఈ పోటీ వద్దని, మండ్య సీటు వదులుకుంటే భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని బీజేపీ నేతలు సుమలతకు హామీ ఇచ్చారని తెలిసింది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని సుమలత ప్రకటించలేదు. ఇలాంటి సమయంలో సుమలత ఆమె తదుపరి రాజకీయ ఎత్తుగడలు, నిర్ణయాలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మండ్య నుంచి మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఎంపీగా పోటీ చేస్తున్నారు.


Tags:
Views: 6

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి