రైతుల పోస్ట్ కార్డు ఉద్యమం. హామీల అమలు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.

రైతుల పోస్ట్ కార్డు ఉద్యమం.  హామీల అమలు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్18:  మంచిర్యాల్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గం మరో వినూత్న ఉద్యమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. చెన్నూర్ నియోజకవర్గం, చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం మొదలుకొని రైతులు స్వచ్చందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయక పోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కోరారు. లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తాం అని రైతులు హెచ్చరించారు.గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేసి తీరాలని లేఖలో రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. 1.వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ.500,2.రైతు భరోసా రూ.10వేలకి బదులు రూ.15వేలు ఇవ్వాలి.3.రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12వేలు చెల్లించాలి. 4.రైతు రుణమాఫీ రూ.2 లక్షలు మాఫీ చేయాలి. 5.వీటితోపాటు రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ.25వేలు చెల్లించాలి.అని లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు.రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు ప్రకటించారు.

Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం