అనాధ శవానికి అంతిమ క్రియలు చేసిన గోవింద్ రెడ్డి

మనసున్న మెట్టు గోవిందరెడ్డి

 అనాధ శవానికి అంతిమ క్రియలు చేసిన గోవింద్ రెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో  నీ స్వామి వివే కానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మాచర్ల జెడ్పి గర్ల్స్ హై స్కూల్ పక్క గల్లీలో గల ఒక అనాధ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మరియు శ్రీ రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు .ఉచిత నారాయణ సేవలో భాగంగాఆ అనాధ మహిళకు కూడ మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు . యధా ప్రకారం శుక్రవారం  మధ్యాహ్నం భోజనం ఇవ్వటానికి  వెళ్ళినప్పుడు ఆమె చనిపోయి ఉండటాన్ని  గమనించారు. ఆమె కు నా అను వారు ఎవరు లేక గత ఐదు సంవత్సరాల నుండి ఎండకు వానకు ఇబ్బంది పడుతూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేది. అయితే ఆమె అంత్యక్రియలకు ఎవరు ముందుకు రాకపోవడంతో మాచర్ల పట్టణ పోలీస్ వారి ఆదేశంతో స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఓబుల చేట్టి నాసరయ్య , గండ్రకోట శివ సుందర ప్రసాద్ , పమ్మి ప్రభాకర్ రెడ్డి లా సహాయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసిన ఆ చుట్టుపక్కల ప్రజానీకం పట్టణ ప్రముఖులు వివిధ సేవాసమితిల సభ్యులు మరియు పట్టణ ప్రజలు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలను అభినందించారు.

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి