బీజేపీలోకి తెలుగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు ఎంట్రీ, మోదీకి జైకొట్టిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ !

బీజేపీలోకి తెలుగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు ఎంట్రీ, మోదీకి జైకొట్టిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ !

బహుబాషనటి, తెలుంగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు, మండ్య ఎంపీ సుమలత అంబరీష్ అలియాస్ సుమలత బీజేపీలో చేరారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఐదేళ్లుగా స్వతంత్ర పార్టీ ఎంపీగా పని చేసిన సుమలత ఈసారి ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్టుతో మరోసారి ఎంపీగా పోటీ చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేసినా చివరికి ఆమె పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. మండ్య ఎంపీ సుమలత అంబరీష్ ఆగస్టు 5వ తేదీన శుక్రవారం అధికారికంగా బీజేపీలో చేరారు. కర్ణాటక లోక్ సభ ఎన్నికల కర్ణాటక ఇన్ చార్జ్ రాధామోహన్ అగర్వాల్ బీజేపీలోకి సుమలత అంబరీష్ కు శాలువా కప్పి ఆమెను బీజేపీలోకి ఆహ్వానించారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప మండ్య ఎంపీ సుమలతకు బీజేపీ జెండా ఇచ్చి పార్టీలోకి ఆమెకు స్వాగతం పలికారు. సుమలత అంబరీష్ కొడుకు అభిషేక్ అంబరీష్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సుమలతకు మద్దతు పలికారు. సుమలతతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, క్రికెటర్ దొడ్డ గణేష్ కూడా శుక్రవారం బీజేపీలో చేరారు. బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మండ్య ఎంపీ సుమలతతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, క్రికెటర్ దొడ్డ గణేష్, వారి అనుచరులు బీజేపీలో చేరారు ఈ సందర్భంగా బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీజీ నాయకత్వంపై అందరూ ఏకీభవించారని, అందుకే బీజేపీలో చేరుతున్నారని అన్నారు. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజకవర్గాల్లో మరోసారి నరేంద్ర మోదీ హవా నెలకొందని, ఏ నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థిని చాలా మంది ప్రజలు ఇష్టపడలేటం లేదని, అందుకు కారణం మోదీ వేవ్ అని బీవై విజయేంద్ర అన్నారు. సుమలత బీజేపీలోకి వచ్చిన తరువాత ఆమె ఏం చేస్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, ఈ విషయంలో సుమలత ఇప్పటికే స్పందించారని, ఆమె బీజేపీకి చెందినవారని, నేను వారిని మనసారా పార్టీలోకి స్వాగతిస్తున్నామని, అంబరీష్‌కి ఉన్న పాపులారిటీ, పార్లమెంటేరియన్‌గా ఆయన చేసిన కృషిని అందరూ గుర్తు చేసుకుంటారని, అలాంటి అంబరీష్ సతీమణి సుమలత రాకతో కర్ణాటక రాష్ట్రానికి సందేశం లాంటిదని బీవై విజయేంద్ర అన్నారు. బీజేపీలో చేరడంపై మాట్లాడిన మండ్య ఎంపీ సుమలత ఈరోజు తన రాజకీయ జీవితంలో మరపురాని రోజు అని అన్నారు. ఐదేళ్ల క్రితం ప్రజలు తనను ఎంపీగా గెలిచారని, అంబరీష్ అభిమానులు తనకు కొండంత బలం చేకూర్చారు. బీజేపీ నాయకులు కూడా బయటి నుంచి తనకు మద్దతు ఇచ్చారని సుమలత గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ మైసూర్ వచ్చినప్పుడు తన భర్త అంబరీష్ కు నివాళులర్పించారని సుమలత గుర్తు చేసుకున్నారు. నేను లోక్‌సభలో అడుగుపెట్టిన రోజు నుంచి బీజేపీ సీనియర్‌ నేతలు నాకు మార్గనిర్దేశం చేశారని, ప్రధాని మోదీయే నాకు స్ఫూర్తి అని, ఆయన ఆలోచనలు తనకు బాగా నచ్చాయని, ఆయన మాటలు, తనకు ఇచ్చిన సలహాలు విన్న తర్వాత బీజేపీలో చేరడం మంచిదని తాను నిర్ణయించుకున్నానని సుమలత అన్నారు. బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు తనకు ఎంతో సహకరించారని, మండ్య ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తనకు సహాయం చేశారని, మై షుగర్ మళ్లీ ప్రారంభించారని సుమలత అన్నారు. బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో మండ్యకు చాలా నిధులు ఇచ్చారని, తరువాత బసవరాజ్ బోమ్మయ్ రూ 50 కోట్లు నిధులు మంజూరు చేసి మై షుగర్ రీ ఓపెన్ కు సహకరించారని సుమలత ఇదే సమయంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, మై షుగర్‌పై మరొకరు క్రెడిట్ తీసుకోవడం సరికాదని, మై షుగర్ రీ ఓపెన్ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని సుమలత అన్నారు. నా భవిష్యత్తు గురించి నేను ఆందోళన చెందడం లేదని, తనకు తన దేశం, తన రాష్ట్రం, తన మండ్య జిల్లా ప్రజలు ముఖ్యం అని, నా భవిష్యత్తు గురించి నేను చింతించడం లేదని, ఈ రోజు తాను బీజేపీలో చేరడం గర్వంగా ఉందని, ప్రజలు నాకు సహకరిస్తారనే నమ్మకం ఉందని సుమలత అంబరీష్ అన్నారు.


Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రిసిప్షన్ సెంటర్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి  అద్వైత్  కుమార్ సింగ్* రిసిప్షన్ సెంటర్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్*
ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మే 09: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పార్లమెంట్  ఎన్నికల  నిర్వహణలో బాగంగా మహబూబాద్, డోర్నకల్ రిషిప్సషన్ సెంటర్ల...
మా మైనారిటీల మద్దతు మీకే..
మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి..- కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం - రాజ్యాంగాన్ని ప్రసాదించేందే కాంగ్రెస్ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు - లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీని కండువా కప్పిన మంత్రి పొంగులేటి
బిజెపి గెలిస్తే.. రాజ్యాంగం రద్దు..- మతతత్వ బిజెపిని ఓడించాలి - ఇండియా కూటమిని గెలిపించాలి
ఈసారి మోదీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు..* రాజ్యాంగాన్ని ఎత్తివేసి నియంత పాలన చేస్తాడు * సబ్బండ వర్గాలు అవస్థ పడతాయి * కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అంతా కృషి చేద్దాం
జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం