లోక్ సభ ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం

లోక్ సభ ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం

ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మార్చి 26:టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ ఎస్ ను 23 ఏళ్ల కిందట స్థాపించారు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి లోక్ సభ ఎన్నికలకు కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు తొలిసారిగా దూరంగా ఉండాలని నిర్ణయించు కున్నారు.2004 నుంచి ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం పోటీపడింది. కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్, ఆయన మేనల్లుడు తన్నీర్ హరీశ్ రావు లోక్ సభ ఎన్నికల్లో తలపడుతారని నిన్న మొన్నటి వరకు చాలామంది ఊహాగానాలు చేశారు. అయితే వారెవరూ బరిలోకి దిగలేదు.కెసిఆర్ కూతురు కె. కవిత 2019లో నిజామాబాద్ నుంచి లోక్ సభ స్థానానికి పోటీపడి ఓడిపోయారు. కాగా ఈ సారి    ఆమె లోక్ సభ స్థానానికి పోటీవడడం లేదు. గతంలో తెలుగు దేశం పార్టీలో ఉండిన కెసిఆర్ టిడిపికి రాజీనామా చేశారు.ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిటి ఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చశారు.  2001లో తెలంగాణ ఉద్యమాన్ని పునరు ద్ధరించారు. 2004లో కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.ఆయన 2006లో జరిగిన ఉప ఎన్నికలో, 2008 లో నూ తన స్థానాన్ని కాపాడు కున్నారు. 2009లో మహ బూబ్ నగర్  నుంచి కెసిఆర్ ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలోనే ఆయన తెలం గాణ రాష్ట్రాన్ని సాధిం చారు.

Tags:
Views: 8

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి