జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు.

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు.

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాద్రి కొత్తగూడెం మార్చి 25: హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన  హోలీ వేడుకల్లో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ దంపతులు, పిల్లలతో కలిసి పాల్గొన్నారు .  రంగుల పండుగ రావడంతో ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. చిన్న పెద్ద తేడా తెలియకుండా రంగులతో ఆడుకున్నారు.జిల్లా కలెక్టర్,  పిఓ దంపతులు పిల్లలతో మరియు సిబ్బందితో  సరదాగా నృత్యాలు చేస్తూ రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణం లో ఆయనకు రంగులు కాకుండా సహజమైన రంగులను వాడి హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు. జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ హోలీ వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, పరిపాలనాధికారి గన్యా, కలెక్టరేట్ సూపర్డెంట్ రమాదేవి,  కార్యాలయ సిబ్బంది  వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:
Views: 25

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

మా మైనారిటీల మద్దతు మీకే.. మా మైనారిటీల మద్దతు మీకే..
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాతి అని, ఈసారి ఎన్నికల్లో తమ మద్దతు అంతా కాంగ్రెస్...
మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి..- కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం - రాజ్యాంగాన్ని ప్రసాదించేందే కాంగ్రెస్ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు - లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీని కండువా కప్పిన మంత్రి పొంగులేటి
బిజెపి గెలిస్తే.. రాజ్యాంగం రద్దు..- మతతత్వ బిజెపిని ఓడించాలి - ఇండియా కూటమిని గెలిపించాలి
ఈసారి మోదీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు..* రాజ్యాంగాన్ని ఎత్తివేసి నియంత పాలన చేస్తాడు * సబ్బండ వర్గాలు అవస్థ పడతాయి * కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అంతా కృషి చేద్దాం
జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి