డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: పోలీస్ కమిషనర్
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కారించుకొని ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అంబేద్కర్ గారి చిత్రపటానికి
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, జాతి నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన సేవలు అనితర సాధ్యమని అన్నారు. భారత రాజ్యాంగం పునాదులపైనే ప్రజాస్వామ్య దేశంగా మనం నిలబడడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐలు సతీష్, హానూక్ పాల్గొన్నారు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
09 May 2024 20:16:10
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
Comment List