మీడియా సెంటర్ ను సందర్శించిన, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మీడియా సెంటర్ ను సందర్శించిన, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

 ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మార్చి 24: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31) లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తు లో ఉన్న కంట్రోల్ రూమ్ల ను శనివారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడం కోసం, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెంటర్  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు సజావుగా సాగడంలో మీడియా కీలకపాత్ర వహించాల్సి ఉంటుందని, అందుకు ప్రతి ఒక్క పాత్రికేయులు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ)   డేవిడ్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సూరినేని శ్రీధర్, ఎంసీఎంసీ నోడల్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, డిడి గ్రౌండ్ వాటర్ వేముల సురేష్, ఏంసిసి నోడల్ ఆఫీసర్ నర్మద, తదితరులు ఉన్నారు.

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ