అక్రమ అరెస్టులకు బయపడం -- వేజెళ్ళ సురేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి భూదాన భూమిని అక్రమంగా దొచేయాలని చూస్తుండు --- ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలి : గ్రామీణ పేదల సంఘం డిమాండ్...

అక్రమ అరెస్టులకు బయపడం  -- వేజెళ్ళ సురేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి భూదాన భూమిని అక్రమంగా దొచేయాలని చూస్తుండు --- ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలి : గ్రామీణ పేదల సంఘం డిమాండ్...

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 27: పాశవిక దౌర్జన్యాలకు,బలవంతంగా ఇండ్లను సోదా చేస్తూ మట్టిని అక్రమరవాణా చేస్తున్నారని పోలీసులు జరిపిన వికృత చర్యలను గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి జిల్లా శాఖ పోలీసుల ఈ దమనకాండను తీవ్రంగా నిరసిస్తూ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ జరిగింది. ఖమ్మం పట్టణ శివారులోని వెలుగుమట్లలో సుమారు 62 ఎకరాల ఏడు కుంటల భూదాన భూమి వుంది.ఈ భూములపై గత పదిహేను సంవత్సరాలుగా పేదలు హక్కులు సంపాదించుకుని ఇండ్లు నిర్మించుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చుకున్నా,ధర్నాలు చేసినా చివరకు హైకోర్టు సైతం జోక్యం చేసుకున్నా పేదప్రజల న్యాయమైన ఈ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేదలకు అరు గ్యారంటీలు అమలు చేసి ఇస్తామని అనునిత్యం ప్రచారం చేసుకునే ప్రభుత్వం సమస్యలను గాలి కొదిలేస్తే...పట్టణ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న ప్రజలే స్వయంగా సంఘం అద్వర్యంలో పోరాడి హక్కులు సంపాదించుకుని ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటుంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వేజెళ్ల సురేష్ అనే వ్యక్తి ఇచ్చిన నిరాధారమైన పిర్యాదుతో   ది:25-03-2024 న సాయంత్రం వేళలో కాలనీలోకి అక్రమంగా చొరబడి ఇళ్లలో దూరి ఇష్టానుసారంగా దౌర్జన్యoగా మహిళలు స్నానం చేస్తున్నారని చెప్పిన వినకుండా విచక్షణ కోల్పోయి నట్టింట్లోకి వెళ్లి అన్నం గిన్నెలను కూర చట్లను విసిరేస్తూ కాలనీ పేదలను భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడంలాంటి పాశవికవిధానాలకు పోలీస్ వ్యవస్థ పాల్పడింది.నిజానికి 31.07కుంటల భూమికి పోలిసు,రెవెన్యూ వారు జోక్యం చేసుకోరాదని హై కోర్ట్ వారి నుండి ఉత్తర్వులు ఇచ్చియున్నది.మిగతా 31.00 ఎకరాల భూమికి స్టేటస్ కో(యధా స్టధం)ఆర్డర్ కొనసాగుతూఉన్నాయని తెలిసి కూడా అధికారపార్టీ అనుచరుల కనుసన్నలలో జరిగిందని కాలనీ ప్రజలు భావిస్తున్నారు. అధికారపార్టీ అనుచరులకు ఈ భూముల విషయంలో ప్రయోజనంకల్గించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం బరితెగించి పోలీసులతో పేదలపై ఈ దౌర్జన్యకాండకు పాల్పడిందని అoటున్నారు.కావున కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ పేదప్రజల వ్యతిరేక విధానాన్ని గ్రామీణ పేదల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పేదలపై పోలీసులు జరిపిన పాశవిక దమకాండ హేయమైనది.ప్రభుత్వం వెంటనే ఈ భూములపై హక్కులు పొందిన పేదలందరికీ ఇండ్లస్థలాలోని గృహాలకు కరెంట్ మీటర్,మంచి నీటి కుళాయిలు తక్షణమే ఏర్పాటు చేసి,పోలీసుల దౌర్జన్యాలను,అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పడిగ యర్రయ్య గారు,ఇండ్ల స్థలాల  కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ జంగం రాంచందర్, గ్రామీణ పేదల సంఘం జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ షేక్ అక్తర్ ఉన్నిషా బేగం, దంతోజు సంధ్య,దశరద గంగమ్మ,షేక్ అనీఫా.మహమ్మద్ సహీన తదితరులు పాల్గొని మాట్లాడారు.

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ
  ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: గుదిమళ్ల వద్ద యేటిలో పడి మృతి చెందిన పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
రిసిప్షన్ సెంటర్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్*
మా మైనారిటీల మద్దతు మీకే..
మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి..- కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం - రాజ్యాంగాన్ని ప్రసాదించేందే కాంగ్రెస్ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు - లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీని కండువా కప్పిన మంత్రి పొంగులేటి
బిజెపి గెలిస్తే.. రాజ్యాంగం రద్దు..- మతతత్వ బిజెపిని ఓడించాలి - ఇండియా కూటమిని గెలిపించాలి