కవితను కలిసిన కేటీఆర్..

కవితను కలిసిన కేటీఆర్..

ఐ ఎన్ బి టైమ్స్ ఢిల్లీ ఏప్రిల్ 15: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ కలిశారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను కేటీఆర్ కలవడం ఇదే తొలిసారి. కేటీఆర్ తో పాటు కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు కూడా ఉన్నారు.కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. లిక్కర్ కేసులో న్యాయపోరాటంపై కవితతో కేటీఆర్ చర్చించారు. సీబీఐ కస్టడీ సమయంలో ప్రతిరోజూ గంటపాటు కుటుంబ సభ్యులను కవిత కలిసేందుకు వెసులుబాటు ఉంది. గతంలో ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు కేటీఆర్. కస్టడీ పొడిగింపు? కవిత సీబీఐ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి కావేరి భవేజా ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టనుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు అధికారులు వివరిస్తారు. కవిత సీబీఐ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని అధికారులు కోరే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలులో కవితను అరెస్ట్ చేసింది సీబీఐ. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ చెప్పింది.

Tags:
Views: 1

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ
  ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: గుదిమళ్ల వద్ద యేటిలో పడి మృతి చెందిన పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
రిసిప్షన్ సెంటర్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్*
మా మైనారిటీల మద్దతు మీకే..
మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి..- కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం - రాజ్యాంగాన్ని ప్రసాదించేందే కాంగ్రెస్ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు - లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీని కండువా కప్పిన మంత్రి పొంగులేటి
బిజెపి గెలిస్తే.. రాజ్యాంగం రద్దు..- మతతత్వ బిజెపిని ఓడించాలి - ఇండియా కూటమిని గెలిపించాలి