విద్యా కమిషన్ పేరుతో కాలయాపన చేయకుండా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన ప్రణాళికను విడుదల చేయాలి.

- పి డి ఎస్ యు రాష్ట్ర అద్యక్షుడు పి.మహేష్.

విద్యా కమిషన్ పేరుతో కాలయాపన చేయకుండా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన ప్రణాళికను విడుదల చేయాలి.



 ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 06:     గతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ముఖ్య కార్యకర్తల సమావేశం లెనిన్ నగర్ న్యూడెమోక్రసీ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని  అన్నారు. అయితే ప్రభుత్వ విద్యారంగం కనీస మౌలిక సదుపాయాలు లేక కూనరిల్లుతుందని అన్నారు.విద్యా కమిషన్ కు కాలపరిమితి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ స్కూల్స్ లో స్కావెంజర్స్,ఉపాధ్యాయుల కొరత ఉందని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కనీస సదుపాయాలు  విద్య మొత్తం నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. ప్రభుత్వ స్కూల్స్ కాలేజీల్లో కనీసం మరుగుదొడ్లు, మంచినీరు, చాక్ పీస్ ఇవ్వలేని స్థితి నేడు నెలకొందని అన్నారు.  ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పనా కూడా విద్యా కమిషన్కు ముడి పెట్టకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యా కమిషన్ ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలను నిర్మూలించే విధంగా కార్యచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఉపాధ్యాయ పోస్టులు  ఖాళీగా ఉన్నాయని, డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. సంక్షేమ హాస్టల్, ఆశ్రమ పాఠశాలల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని దీని ద్వారా పేద, మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రమైన అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నారని, ముఖ్యమంత్రి పర్యటన లోపు ఖమ్మం జిల్లాకు కేటాయించిన యూనివర్సిటీని పూర్తిస్థాయిలో నిర్మించే విధంగా, పాలేరు జేఎన్టీయూ కాలేజీని అన్ని సౌకర్యాలు కల్పించి  అందుబాటులోకి తేవాలని వీటి మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వారు  ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో .పి డి ఎస్ యు జిల్లా నాయకులు సాగర్ గోపి.సర్వేందర్ మణికంఠ ప్రభు గాంధీ  ఆర్కే పాల్గొన్నారు....
 

Tags:
Views: 8

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ