స్థంబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవలో తాండ్ర -- సాయి గణేష్ కుటుంబానికి పరామర్శ

పార్టీ అండగా ఉంటుందని అమ్మమ్మ సావిత్రమ్మకు హామీ: బిజెపి నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు

స్థంబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవలో తాండ్ర   -- సాయి గణేష్ కుటుంబానికి   పరామర్శ

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 27:  నాటి అధికార పక్షం రాజకీయ వేధింపులు భరించలేక 2022 ఏప్రిల్ లో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేష్ (26) కుటుంబాన్ని పార్టీ ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు బుధవారం పరామర్శించారు. స్థంబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర్ రావు తదితర నాయకులతో  కలిసి వినోద్ రావు  ఖమ్మం పట్టణంలోని జూబ్లీపురలో ఉన్న సాయి గణేష్ నివాసానికి వెళ్లారు. వారి అమ్మమ్మ సావిత్రమ్మ ని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం మున్సిపల్ పరిధిలోని 46వ డివిజన్ లో నివసించిన సాయి గణేష్ మీద పెట్టిన దొంగ కేసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం, ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శించడం తెలిసిందే. "కార్యకర్తలే మా బలగం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ప్రతి కార్యకర్తా మోడీ తో, అమిత్ షా తో, కిషన్ రెడ్డి తో సమానం. క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నేను భరోసా ఇస్తున్నా," అని వినోద్ రావు చెప్పారు. అంతకుముందు వినోద్ రావు, వారి కుమారుడు వినీత్ స్థంబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.  వారికి వేద పండితులు ఆహ్వానం తెలిపి ఆశీస్సులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో  7 వ  డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు దుద్దుకూరి వెంకటేశ్వర రావు, అసెంబ్లీ కన్వీనర్అల్లిక అంజయ్య, అనంత ఉపేందర్, తజనోత్ భద్రం, చావా కిరణ్, భూక్యా శ్యాం రాథోడ్, పిల్లలమర్రి వెంకట్, పాలేపు రాము, శాసనాల సాయి, గోనెల శివ, దార్ల శంకర్ తదితర నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ