జిల్లా కోర్టులో ఈ సేవా కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై. చంద్రచూడ్

జిల్లా కోర్టులో ఈ సేవా కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై. చంద్రచూడ్

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మార్చి 27: బుధవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కోర్టులో ఈ సేవా కేంద్రాన్ని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై. చంద్రచూడ్ చే వర్చువల్ విధానం ద్వారా సాయంత్రం 5:45 నిమిషాలకు  ప్రారంభోత్సవం చేసిఆయన మాట్లాడారు.ఈ- సేవా కేంద్రం ద్వారా కేసు యొక్క స్థితిగతులు, కేసుకు సంబంధించిన పూర్తి సమాచార వివరాలను సర్టిఫై కాపీలను పొందవచ్చని, న్యాయవ్యవస్థలోని (12) రకాల పౌర సేవలను అత్యంత వేగంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కె. మౌనిక, అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డి.వెంకటస్వామి, ప్రభుత్వా న్యాయవాది కొంపెల్లి వెంకటయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్  వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు సురేష్ రెడ్డి, రవికుమార్, నగేష్, స్పెషల్ ఫోక్సో కోర్టు పిపి పద్మాకర్ రెడ్డి, ఏజిపి ఆనంద్ కుమార్, కోర్టు సిబ్బంది మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 19

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ