యూనిఫామ్ ఇప్పించాలని సెక్యూరిటీ గార్డ్ లు వినతి పత్రం. -- కాంట్రాక్టర్ ద్వారా ఉచిత యూనిఫాం ఇప్పించాలి

-- కర్నే రవికి వినతి పత్రం ఐ ఎన్ బి టైమ్స్ మణుగూరు మార్చి 28:

యూనిఫామ్ ఇప్పించాలని సెక్యూరిటీ గార్డ్ లు వినతి పత్రం. -- కాంట్రాక్టర్ ద్వారా ఉచిత యూనిఫాం ఇప్పించాలి

గత ఇరవై సంవత్సరాలుగా సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న  మాకు కాంట్రాక్టర్ ద్వారా  ఖాకీ యూనిఫామ్ విప్పించాలని న్యాయవాది, సామజిక కార్యకర్త కర్నె రవికి వినతి పత్రం అందజేశారు. గురువారం ఉదయం మణుగూరు మండలం లోని రవి న్యాయవాది కార్యాలయం లో సింగరేణి ఏరియా నందు  ఎస్ అండ్ పీసీ డిపార్ట్మెంట్ లో గత ఇరవై సంవత్సరాలుగా సెక్యూరిటీ కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నామని, యూనిఫామ్ కోసం అధికారులకు,నాయకులకు పలు మార్లు చెప్పిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.సెక్యూరిటీ టెండర్, మ్యాన్ పవర్ ఏజెన్సీ టెండర్ దక్కిన  కాంట్రాక్టర్  ద్వారా ఉచిత ఖాకీ యూనిఫాం ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ మురళి మ్యాన్ పవర్ ఏజెన్సీ కొత్త టెండర్ల  కాంట్రాక్టర్ తో సింగరేణి అధికారులు తో మాట్లాడి ఖాకి యూనిఫామ్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మురళి మ్యాన్ పవర్ ఏజెన్సీ టెండర్ లో కొంతమంది సింగరేణి గార్డ్స్ ఆ కాంట్రాక్టర్ కి మాయ మాటలు చెబుతూ మా పర్మినెంట్ గార్డ్స్ తో బాటు వారికి యూనిఫామ్ ఏ విధంగా ఇస్తారు అని ఆ కాంట్రాక్టర్ కి మాయ మాటలు నేర్పుతున్నారు అని కర్నే రవి అన్నారు.  ఈ  కార్యక్రమంలో న్యాయవాది రాము,
వి.శ్రీనివాస్,పి.సుదీర్,వీరబాబు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సంపత్,సతీష్,మధు,సుజిత్,రవి, కటేశ్వర రావు పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ