గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ఐన్బిటైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి: మంది ప్రాణ త్యాగాల ఫలితమే మండల టిడిపి కోర్ కమిటీ సభ్యులు వెన్నా సీతారామిరెడ్డి  తెలియచేశారు. మండలంలోని నాగిరెడ్డిపాలెం స్టానిక సచివాలయం వద్ద ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సెక్రటరీ వసంతరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పోరాట యోధులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దైర్య,సాహస, త్యాగాల తో దాదాపు 200 సంవత్సరాలు బానిస వ్యవస్థనుండి భారతమాతకు విముక్తి కలిగించారని, మనం వారి త్యాగాలను మరువకుండా దేశ భక్తి, మాతృభక్తి భావాలతో దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అదేవిదంగా భారత జాతికి దారి చూపిన మన రాజ్యాంగం గురుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగం రూపకల్పన చేసిన మహనీయులకు మనం ఎంతో ఋణ పడివున్నామని, రాజ్యాంగ విలువలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ అయ్యప్ప, వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ చైతన్య, డిజిటల్ అసిస్టెంట్ జ్యోజి రాయన్న,మహిళా పోలీస్ మహాభూబీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆశా వర్కర్లు కోటేశ్వరి గ్రామ్ పార్టీ అధ్యక్షుడు బద్దూరి వీరారెడ్డి, బద్దూరి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 35

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన