నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన కొవ్వాడ బాబురావు అనే వ్యక్తి తన ఇంటి వద్ద పెంచుకుంటున్న నాటు కోళ్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. తక్షణమే గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చేపట్టి, నాటు కోళ్లు దొంగతనం చేసిన ఆవుల గోపి, కొత్తపల్లి రమేష్, పిల్లల సురేంద్ర మేడికొండ అనిల్ కుమార్ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 30 వేల రూపాయలు విలువగల నాటు కోళ్లను స్వాధీనం చేసుకున్నామని, అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలో ఎవరైనా ఇటువంటి దొంగతనాలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక చర్యలకు దిగినా వారిపై కఠినంగా వ్యవహరించి, చట్టపరంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

Ad
 

Tags:
Views: 21