ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రజాసేవకు నిదర్శనం:షేక్ జానీ భాష

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రజాసేవకు నిదర్శనం:షేక్ జానీ భాష

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి జనవరి 31: పల్నాడు జిల్లా టిడిపి పార్లమెంటరీ సెక్రటరీ(మాజీ కౌన్సిలర్) షేక్ జానీ భాష తన 26 వ వార్డులోని 58వ బూత్ నందు పెన్షన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు స్వయంగా పంపిణీ చేశారు.వృద్ధులు,వికలాంగులు,విధవలు సహా రెండు కొత్త స్పౌజ్ పెన్షన్లను,అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించారు.ఈ సందర్భంగా షేక్ జానీ భాష మాట్లాడుతూ...ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే జనవరి 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. మాచర్ల నియోజవర్గం అభివృద్ధి పథంలో నడవడానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.“ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరాలన్నదే తమ లక్ష్యం అని,పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన ధ్యేయం”అని అన్నారు.పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ,సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న షేక్ జానీ భాష సేవాభావాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.వార్డులో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సామాజిక భద్రతకు ఆయన చేస్తున్న కృషి ఆదర్శంగా నిలుస్తోంది.ఈ కార్యక్రమంలో వార్డు కన్వీనర్ కె.పార్వతి,జనసేన నాయకులు షేక్.ఫారుక్, కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు

Ad
 

Tags:
Views: 9

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
  రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన