మాచర్ల కృష్ణవేణి జూనియర్ కాలేజీ నందు జరిగిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై ఐఈసి వారి అవగాహన కార్యక్రమం

కళాశాల ప్రిన్సిపల్ వై. వెంకట్రామయ్య ఆధ్వర్యంలో నిర్వహణ

మాచర్ల కృష్ణవేణి జూనియర్ కాలేజీ నందు జరిగిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై ఐఈసి వారి అవగాహన కార్యక్రమం

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 15:పల్నాడు జిల్లా, మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు కొనసాగుతున్న ఐఈసీ (ఇన్‌ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) ప్రచార కార్యక్రమం సందర్భంగా, ఇటీవల అవగాహన సమావేశం నిర్వహించారు. ఎనిమిది అంశాల ప్రాధాన్యంలో భాగంగా, ఆరవ అంశమైన "హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ మరియు లైంగిక వ్యాధుల (ఎస్టీఐ) నివారణ మరియు చికిత్స" పై విస్తృతంగా చర్చ జరగింది. ఈ సందర్భంగా వనరుల బృంద సభ్యులు హెచ్‌ఐవీ వ్యాప్తి మార్గాలు, వ్యాపించని మార్గాలను వివరించి, సమాజంలో ఉన్న అపోహలను తొలగించారు. చేతులు కలపడం, భోజనం పంచుకోవడం, దోమ కాటు వంటి కారణాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదని స్పష్టంగా తెలియజేశారు.లైంగిక వ్యాధులను (ఎస్టిఐ) చికిత్స చేయనట్లయితే హెచ్‌ఐవీ వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందని, ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని వివరించారు. ఎస్టిఐ పూర్తిగా చికిత్స చేయదగినవేనని, అయితే డాక్టర్ సూచించిన మెడికల్ కోర్సును పూర్తిగా తీసుకోవడం ఎంతో కీలకం అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఎస్టిఐ, మరియు హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నదని తెలిపారు. అవగాహన పెంపొందించడం ద్వారా సమాజంలో ఉన్న అపహాస్యం, భయాలను తగ్గించగలమని, తద్వారా మరింత మంది ముందుకు రావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.హెచ్‌ఐవీ నివారణకు — సురక్షిత లైంగిక ప్రవర్తన పాటించడం, కండోమ్ వినియోగం, పరిశీలించిన రక్త ఉత్పత్తులనే వినియోగించడం, శుభ్రమైన సూదుల వాడకం, అలాగే గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచనల మేరకు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం వంటి ముఖ్యమైన సూచనలు కార్యక్రమంలో ప్రస్తావించబడ్డాయి.ఈ కార్యక్రమాన్ని రీడ్స్ సంస్థ సభ్యులు అవుట్‌రీచ్ వర్కర్ మౌలాబి(పీర్ ఎడ్యుకేటర్) ఆశా కలిసి నిర్వహించారు.కృష్ణవేణి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వై. వెంకట్రామయ్య, డైరెక్టర్ శ్రీనివాసరావు, సుబ్బారావు, గురవయ్య కాలేజీ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయబడిందని తెలియజేశారు.

Tags:
Views: 8

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం