ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం
పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేష్ నాయక్ నియామకం
అభినందనలు తెలిపిన పలువురు బంజారా సేవా సంఘం నాయకులు
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురిసౌత్ ప్రతినిధి సెప్టెంబర్ 15:ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మాచర్ల మండలం చింతలతండా గ్రామానికి చెందిన రమావత్ భీమా నాయక్, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాళ్లపల్లి గ్రామానికి చెందిన బాణావత్ వెంకటేష్ నాయక్ లు గుంటూరు పోలీస్ కళ్యాణ మండపము నందు ఆదివారం జరిగిన ఎన్నికలో ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు బాణావత్ చక్రి నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు టీసి రాథోడ్, అడిషనల్ డీజీపీ రిటైర్డ్ డీటి నాయక్, ఐజీపీ రిటైర్డ్ కొర్ర జగన్నాథరావు నాయక్, ఐఆర్ఎస్ రిటైర్డ్ స్వామి నాయక్, రిటైర్డ్ ఎస్పీ రవీంద్రా నాయక్, డాక్టర్లక్ష్మానాయక్, రిటైర్డ్ ఎస్పీ చాంద్ నాయక్, డాక్టర్ బాలాజీ నాయక్, మాజీ ట్రైకార్ చైర్మన్, తెదేపా రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం.ధారు నాయక్, ఐఏఎస్ చిన్న రాముడు నాయక్, బి.వి.రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం విజయపురిసౌత్లో మీడియాతో భీమా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ వారి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన సంఘం పెద్దలకు, శ్రేయోభిలాషులకు, తోటి సంఘీయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాణావత్ వెంకటేష్ నాయక్, పలువురు సంఘం నాయకులున్నారు.
Comment List