అండర్-19 జూనియర్ కళాశాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేత కృష్ణవేణి జూనియర్ కళాశాల టీం వినుకొండ

మాచర్ల నూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అండర్-19 క్రికెట్ పోటీలు

అండర్-19 జూనియర్ కళాశాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేత కృష్ణవేణి జూనియర్ కళాశాల టీం వినుకొండ

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 15:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలంలోని అలుగురాజుపల్లి గ్రామంలోని న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో, గత వారం రోజుల నుంచి జరుగుతున్న అండర్-19 జూనియర్ కళాశాలల క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని నూటన్స్ కళాశాల వారు తెలియజేశారు. కర్నూలు, ప్రకాశం, పల్నాడు, మరియు గుంటూరు జిల్లాలలోని, జూనియర్ కళాశాలల కు సంబంధించిన క్రికెట్ జట్లు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధించిన జట్లకు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం నిర్వహించిన సభలో క్రీడాకారులను ప్రశంసించి బహుమతులు అందజేశారు. ఈ జూనియర్ స్థాయి క్రికెట్ పోటీలలో మొదటి బహుమతిని 25000/- రూ నగదు, మరియు షీల్డ్ ను కృష్ణవేణి జూనియర్ కళాశాల వినుకొండ వారు గెలుపొందడం జరిగిందని తెలిపారు. రెండవ బహుమతి 20000/- రూ నగదు మరియు షీల్డ్ ను ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ జూనియర్ కళాశాల అచ్చంపేట వారు గెలుపొందగా, మూడవ బహుమతి 15000/- రూ నగదు మరియు షీల్డ్ ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా బహుకరీంచడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ జున్నా శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జీ.జగదీశ్వర్ రెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు.

Tags:
Views: 4

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...
గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు