మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన

మాచర్ల టౌన్ సిఐ టి.వెంకటరమణ

మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8:

Ad
మాచర్ల పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేసి,మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం,నెహ్రూనగర్ 2వ లైన్, 2వ వార్డు, మాచర్లకు చెందిన పఠాన్ రంజాన్ (33) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2025 జనవరి 1 రాత్రి 10 గంటల నుంచి జనవరి 2 తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఫిర్యాదుదారుడి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న హోండా యూనికోర్న్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,నెహ్రూనగర్‌కు చెందిన ఓర్సు దుర్గా రావు అలియాస్ బుగ్గలోడు (20) అనే యువకుడిని నిందితుడిగా గుర్తించారు.ఫిబ్రవరి 7న సాయంత్రం 7 గంటల సమయంలో నెహ్రూనగర్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ టి.వెంకటరమణ తెలియజేశారు.

Tags:
Views: 21

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు! తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..