ఉపాధి హామీ పనులపై గ్రామసభ...

ఉపాధి హామీ పనులపై గ్రామసభ...

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, నవంబర్ 22:పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంనకు సంబంధించిన సేవలను ప్రజలు ముందుకు తీసుకొచ్చేందుకు మండలంలో ఉన్న గ్రామపంచాయతీలలో గ్రామసభ నిర్వహించడం జరిగిందని ఏపీవో అప్పలరాజు తెలిపారు. గోకవరం మండలము నందు ఉన్న 14 గ్రామపంచాయితీలలో ఉపాధి హామి పథకానికి సంబంధించి జాబ్ కార్డు అర్హుల మీద ప్రత్యేక అధికారుల ద్వారా శనివారం మెగా గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు.కొత్త జాబ్ కార్డ్ దరఖాస్తులు సేకరించి, మంజూరు చేయుట జరుగుతుందన్నారు. ఇటీవల  ఈ కేవైసీ సమస్యలు కారణంగా రద్దు అయిన 2548 జాబ్ కార్డ్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా శనివారం పునరుద్ధరణ చేసుకొనుటకు 258 మంది మరియు కొత్త గా జాబ్ కార్డ్ కావలసిన 75 మంది ఉపాది శ్రామికులు  దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ఆదేవిధముగా 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్తగా 120 పనులు గుర్తించామన్నారు. ఈ గ్రామ సభలు నిర్వహించుటకు ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో గోకవరం మండలంనకు సంబంధించి ప్రత్యేక అధికారులుగా ఎపిడ్. ఎన్.ఆర్.ఈ.జి.యస్, ఎపియమ్. డి.ఆర్.డి.ఎ. అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్.డబ్ల్యుయస్, డిప్యూటీ ఎమ్.పి.డి.వి. అసిస్టెంట్. ఇంజనీర్, హౌసింగ్, సంబంధిత గ్రామపంచాయితీ సెక్రటరీలు, ఉపాధి హామి ఇంజనీరింగ్ కన్సల్ టెంట్, టెక్నికల్ అసిస్టెంట్స్, పీల్డ్ అసిస్టెంట్స్, ఉపాధి హామి శ్రామికులు పాల్గొన్నారు.

Ad
 

Tags:
Views: 17

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న.. మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
పశువులు మన సాంప్రదాయంలో భాగం
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు – ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక