కోడిపోరు ఉత్సవానికి విచ్చేసిన అతిథులు -నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి - మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి

కోడిపోరు ఉత్సవానికి విచ్చేసిన అతిథులు -నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని కారంపూడి పట్టణంలో శనివారం రోజున జరిగిన కోడిపోరు ఉత్సవంలో పాల్గొన్న అనంతరం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ...
శతాబ్దాల చరిత్ర పలనాటి చరిత్ర . అలనాటి సమానత్వాన్ని తెలిపేవే వీరుల మహోత్సవంలోని ఘట్టాలు. గతంలో ఉన్న ఘర్షణ వాతావరణం నుంచి ఘనంగా అభివృద్ధి వైపు పల్నాడు పురోగిమిస్తుంది. పర్యావరణ అనుమతులు రాగానే వరికిపూడిశెల పనులు ప్రారంభమవుతాయి.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జల్ జీవన్ మిషన్  పనులకు శంకుస్థాపనతో నిర్మాణానికి అడుగులు పడతాయి. రాష్ట్ర, జాతీయ రోడ్ల అనుసంధానంతోనే అభివృద్ధి పరుగులు పెడుతుంది. పల్నాడు జిల్లా పరిధిలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పరిశ్రమలను ఆహ్వానిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో  పల్నాడు శరవేగంగా ప్రగతిని సాధిస్తుంది. టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి మాట్లాడుతూ... పల్నాడు అంటే సమానత్వపు చరిత్ర,ప్రాచీన చరిత్రను తెలిపేవే వీరుల ఉత్సవాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాయలసీమలో, ఎమ్మెల్యే జూలకంటి సారధ్యంలో మాచర్ల లో ఫ్యాక్షన్ సమిసిపోతుంది.జగన్ రెడ్డి కనుసన్నల్లో గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకే వైసీపీ పనిచేస్తుంది. అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. వైసిపి అసాంఘిక శక్తితో అభివృద్ధి శూన్యం : మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి.

Ad
జూలకంటి బ్రహ్మనందరెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పల్నాడు ప్రాచీన వైభవానికి పునర్నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.సాంస్కృతిక సంపద కాపాడే దిశగా వీరులాలయాన్ని అభివృద్ధి చేస్తాం, మాచర్ల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం,
వీర్ల దేవాలయం ప్రాంగణంలో వచ్చే ఏడాది నాటికి వసతి గృహాలను నిర్మిస్తామని అన్నారు.

Tags:
Views: 24

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన