ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా , కృష్ణాజిల్లాల బాడి ప్రమాణస్వీకారోత్సవం

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా , కృష్ణాజిల్లాల బాడి ప్రమాణస్వీకారోత్సవం

ఐ ఎన్ బి టైమ్స్ , డిసెంబర్ 21:విజయవాడ ప్రతినిధి : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణాజిల్లాల బాడి ప్రమాణస్వీకారోత్సవం  గవర్నర్ పేట, విజయవాడ లో గల బసవ పున్నయ్య  విజ్ఞాన కేంద్రం నందు అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు చక్రి నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంజారాలో ఉన్నారని ప్రభుత్వమే మర్చిపోయిందని పంచారాలకు రాజకీయపరంగా వృత్తి నైపుణ్యత పరంగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అలాగే చాలా తాండాలకి రోడ్డు రవాణా సౌకర్యం లేక సెల్ ఫోన్ టవర్లు లేక, సరేనా తాగునీటి సరఫరా లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని , పంజరాలు నివసిస్తున్న ప్రాంతాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని,వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బంజారాలకు సరైన న్యాయం జరిగే దిశగా పాటుపడతామని తెలియజేశారు, ఒకవేళ ప్రభుత్వం బంజారాలకు జరుగుతున్న అన్యాయంపై మొండివైఖరి గనుక ప్రదర్శిస్తే విజయవాడ నడిబొడ్డులో లక్షమంది బంజారాలతో సభను నిర్వహించి ప్రభుత్వానికి బంజారాల ఐక్యతను చూపిస్తూ ప్రభుత్వానికి సరైన విధంగా మార్గనిర్దేశం ఇచ్చేలాగా చేయాల్సి వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చక్రి నాయక్, ప్రధాన కార్యదర్శి జటావత్ రాంబాబు, బాలాజీ, బి వెంకటేశ్వర్లు, వాసు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:
Views: 28

About The Author

Related Posts

Post Comment

Comment List